Advertisementt

‘సువర్ణసుందరి’ సెన్సార్‌కు సిద్ధమైంది

Tue 26th Feb 2019 12:02 AM
purna,jayapradha,suvarna sundari,sensor,latest,update  ‘సువర్ణసుందరి’ సెన్సార్‌కు సిద్ధమైంది
Suvarna Sundari Ready to Sensor ‘సువర్ణసుందరి’ సెన్సార్‌కు సిద్ధమైంది
Advertisement
Ads by CJ

జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సువర్ణసుందరి’.  సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోందన్న క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని  రీతిలో ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న  ఈ చిత్రం మార్చిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కు మిలియన్ వ్యూస్ లభించాయి.

ఈ సందర్బంగా డైరెక్ట‌ర్ సూర్య మాట్లాడుతూ... సువర్ణసుందరి  చిత్రంలో ఎఫ్ఎక్స్ కోసం ఏడాదిపాటు వ‌ర్క్ జ‌రిగింది.  లేటు అయినా కూడా ఫ‌లితం చాలా బాగా వ‌చ్చింది. దానికి నిదర్శనం మా చిత్ర ట్రైలర్ ‌కు వచ్చిన రెస్పాన్స్ . సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది.

మూడు జన్మల కాన్సెప్ట్ తో హిస్టారికల్ థ్రిల్లర్ గా తీసిన ఈ చిత్రం సెన్సార్ కు సిద్దమయింది. మార్చి తొలివారంలో పాటలను రెండో వారంలో  సినిమాను తెలుగు, కన్నడ ,తమిళ్ భాషల్లో ఒకేసారి  విడుదల చేయటానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారన్నారు.

జ‌య‌ప్ర‌ద‌, పూర్ణ‌, సాక్షి, ఇంద్ర‌, రామ్, సాయికుమార్‌, కోటాశ్రీ‌నివాస‌రావు, ముక్త‌ర్‌ఖాన్‌, నాగినీడు, స‌త్య‌ప్ర‌కాష్‌, అవినాష్ న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ్యూస‌ర్ ఎమ్.ఎల్. లక్ష్మి, మ్యూజిక్‌ డైరెక్ట‌ర్: సాయికార్తిక్‌, స్టంట్స్: రామ్‌సుంక‌ర‌, ఆర్ట్ డైరెక్ట‌ర్: నాగు, డి.ఓ.పి. ఎల్లుమహంతి, ఎడిట‌ర్: ప్ర‌వీణ్‌పూడి, స్టోరీ: ఎం.ఎస్‌.ఎన్.సూర్య‌, పి.ఆర్‌.ఓ. సాయిస‌తీష్‌, డైరెక్ట‌ర్: ఎం.ఎస్‌.ఎన్‌.సూర్య‌.

Suvarna Sundari Ready to Sensor:

Suvarna Sundari Latest Update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ