ప్రస్తుతం దేశంలోనే మోస్ట్ డిజైరబుల్, వాటెండ్ బ్యాచ్‌లర్ ఎవరు అంటే ఠక్కున ఆరడుగుల ఆజానుబాహుడు, యంగ్‌రెబెల్‌స్టార్, ‘బాహుబలి’ ద్వారా దేశ విదేశాలలో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ పేరే చెప్తారు. ఒకవైపు ఈయనకు అనుష్కతో పాటు పలువురితో ఎఫైర్లు అంటకడుతున్నారు. ఏజ్ కూడా బాగా పెరుగుతోంది. ఎప్పుడో పెళ్లి చేసుకుని పిల్లలకు తండ్రి కావాల్సిన ఆయన పెళ్లి అంటే అదిగో ఇదిగో అంటూ వాయిదాలు వేస్తున్నాడు. ఆయన పెదనాన్న కృష్ణంరాజు మాత్రం త్వరలోనే ప్రభాస్‌కి పెళ్లి అంటూ ఎన్నో ఏళ్లుగా చెబుతున్నా, ప్రభాస్ మాత్రం ఎస్కేప్ అవుతూనే ఉన్నాడు.
ఇక ఈయన కేవలం మహిళలు, యువతులకే కాదు.. సినీ పరిశ్రమలోని నటీమణులకు కూడా బెస్ట్ ఆప్షన్‌గా మారుతున్నాడు. ఇటీవలే తమిళ నటి, నటుడు శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్‌కుమార్ నేను ఐ లవ్యూ చెప్పాల్సి వస్తే కేవలం ప్రభాస్‌కి మాత్రమే చెబుతాను. ఆయనంటే నాకు అంత ప్రేమ. ఆయన ప్రేమను పొందాలనేది నా ఆశ. ప్రభాస్ అంటే నాకు అంత ఇష్టం అని బోల్డ్‌గా చెప్పేసింది. ఇప్పుడా లిస్ట్‌లోకి మరో బాలీవుడ్ నటి కూడా చేరింది. ఆమె ఎవరో కాదు.. సంచనల నటిగా పేరు తెచ్చుకున్న స్వరాభాస్కర్. ‘వీర్ ది వెడ్డింగ్’ చిత్రంతో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆమె తాజాగా మాట్లాడుతూ, ప్రభాస్ ఈజ్ సో హాట్. ఆయనంటే పడి చచ్చిపోతాను. ఇంతటి సెక్సీమేన్‌ని ఇప్పటివరకు చూడలేదు. నేను ప్రభాస్‌పై మనసు పారేసుకున్నానని ఓపెన్‌గా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
నిన్నటితరంలో ఏ భాషా హీరోయిన్‌ని అడిగినా తెలుగులో నాగార్జునతో నటించాలని ఉందని చెప్పేవారు. ఆ తర్వాత మహేష్ బాబు పేరు చెప్పడం కామన్ అయిపోయింది. ప్రస్తుతం మాత్రం అందరి నోటి వెంట బాహుబలి పేరే వినిపిస్తూ ఉండటం విశేషం. ఇక ప్రస్తుతం యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్, సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నాడు. 2019 మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఇదేనని చెప్పాలి. ‘బాహుబలి’ రేంజ్‌లోనే 250కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు ధీటుగా ఇది తెరకెక్కుతోంది. ముఖ్యంగా కెన్నీ బెట్స్ తీసిన యాక్షన్ సీన్స్‌కి గ్రాఫిక్స్ జోడిస్తే అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది.
దుబాయ్, అబుదాబి, రామోజీ ఫిల్మ్‌సిటీ వంటి చోట్ల షూటింగ్ జరిపారు. ఈ చిత్రం లుక్స్‌కి, స్టిల్స్‌కే కాదు ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1’ మేకింగ్ వీడియో యూట్యూబ్‌లో 10కోట్ల వ్యూస్‌ని సాధించుకుని సంచలనం సృష్టించింది. ఇక ఈ చిత్రంపై మరింత ఆసక్తి కలిగేలా ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2’ మేకింగ్ వీడియోను మార్చి 3న విడుదల చేయనున్నారు. కాగా ఈ చిత్రాన్ని స్వాతంత్య్రదినోత్సవ కానుకగా ఆగష్టు15న పలు భాషల్లో రిలీజ్ చేయనున్నారని సమాచారం.