రెండు రోజులు కిందట ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ అయింది. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్‌ను ఎంతో ప్రెస్టేజియస్‌గా తీసుకుని చిత్రీకరిస్తే రెండు భాగాలని ప్రేక్షకులు మోహమాటం లేకుండా రిజెక్ట్ చేసారు. నిజాలు చూపించడంలో బాలకృష్ణ ఫెయిల్ అయ్యాడు అందుకే పూర్తి స్థాయిలో ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి వర్మ తీయబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ మీదే.
ఈమూవీని వర్మ ఎప్పుడు రిలీజ్ చేస్తాడో చెప్పలేదు కానీ ప్రమోషన్స్ అయితే ఒక రేంజ్‌లో చేస్తున్నాడు. ఎన్టీఆర్ కొడుకు తీసిన సినిమానే ప్రేక్షకులు చూడలేదు, మరి ఎన్టీఆర్‌తో ఏ సంబంధం లేని వర్మ తీస్తే చూస్తారా? అనే అనుమానాలు పబ్లిక్‌లో లేకపోలేదు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్‌కి యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. దీన్ని క్యాష్ చేసుకుని వర్మ త్వరగా రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్‌తో పాటు కలెక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తాజాగా ఈ సినిమా యొక్క థియేట్రికల్ రైట్స్ 9 కోట్లుకి అమ్ముడైన్నట్టు టాక్. సో ఎంత త్వరగా సినిమా చేసి అంత త్వరగా ఇస్తే మంచిది. సినిమాపై బజ్ గురించి ఎటువంటి ఆందోళనా లేదు. వర్మ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి మహానాయకుడు సినిమాను దెబ్బ తీసే విధంగా ప్రమోషన్స్ చేసాడు. మరి వర్మ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.