నిజమే.. గజదొంగకంటే చిన్న దొంగ బెటర్. గుడిని మింగేవాడికంటే, గుడిని గుడిలో లింగాన్ని కూడా స్వాహా చేసే వాడు మేలు. అందరు దొంగలే అయినప్పుడు కాస్త తక్కువ దొంగని ఛాయిస్‌గా ఎంచుకోవడమే బెటర్. అందుకే చిన్న గీత పక్కన పెద్దగీత గీస్తే సరిపోతుంది అంటారు పెద్దలు. ఇక విషయానికి వస్తే కిందటి ఎన్నికల్లో పవన్ చంద్రబాబుకి ఎందుకు మద్దతు ఇచ్చాడని ఇప్పటికీ చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. దానిపై ఇప్పటికీ పవన్, నాగబాబులు స్పందించారు. నాడు జగన్ ప్రభంజనం బాగా ఉందని, కానీ కొత్తగా విడిపోయిన రాష్ట్రం కనక అనుభవజ్ఞుడైన చంద్రబాబే బెటర్ అని భావించామని చెప్పుకొచ్చారు.
ఇక విషయానికి వస్తే తాజాగా జనసేనాధిపతి పవన్ టిడిపి, వైసీపీలు తనని లక్ష్యం చేసుకుంటున్నాయని, తాను పోరాడే సైనికుడినని ఆ పార్టీలు తెలుసుకోవాలని సుతిమెత్తగా కౌంటర్ ఇచ్చాడు. దీనిపై మెగాబ్రదర్ నాగబాబు కూడా తన యూట్యూబ్ చానెల్‌లో వివరించారు. ఆయన మాట్లాడుతూ, రెండో ప్రపంచ యుద్దంలో అడాల్ఫ్ హిట్లర్ అనే నరరూప రాక్షసుడు ఉండేవాడు. అతనికి ప్రచార మంత్రిగా గోబెల్స్ పని చేసేవాడు. గోబెల్స్ ‘హిట్లర్ అంత గొప్ప.. ఇంత గొప్ప’ అని ప్రచారం చేసేవాడు. నాడు సోషల్‌మీడియా లేదు కాబట్టి గ్లోబెల్స్ ప్రచారాలు విజయవంతం అయ్యాయి. ఇప్పుడు జనసేనని తొక్కేయాలని, జనసైనికుల మనోస్ధైర్యాన్ని దెబ్బతీయాలని గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. కానీ జనసేనకి, జనసైనికులకు ఇప్పుడు సోషల్‌మీడియా అండగా ఉంది.
జగన్ వంటి పెద్ద చెడ్డవాడు కంటే.. కాస్త తక్కువ చెడ్డవాడు కావడంతోనే గత ఎన్నికల్లో పవన్, చంద్రబాబుకి మద్దతు ఇచ్చాడు. అప్పట్లో మరో చాయిస్ లేకుండా పోయింది. పవన్, టిడిపి, వైసీపీలలాగా క్రిమినల్, ఫ్యాక్షన్, స్కామ్స్, లిక్కర్, ఇసుక మాఫియా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి రాలేదు. స్వచ్చమైన పాలన అందించేందుకు వస్తున్న పవన్‌పై ఎంతటి గ్లోబెల్స్ ప్రచారం చేసినా ఫలితం ఉండదని ప్రత్యర్ధులు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం సోషల్‌మీడియా ఎంతో బలంగా ఉందని చెప్పుకొచ్చాడు.