నిజాలని నిర్భయంగా ఒప్పుకోవడంలో రామ్ గోపాల్‌వర్మని మించిన వారు లేరు. వివాదాల్ని తన సినిమాలకు ప్రచార అస్త్రాలుగా మార్చుకోవడంలోనూ వర్మదే పైచేయి. కిందపడినా నాదే పైచేయి అనే మసస్థత్వం వర్మది. ఒక దశలో వరుస ఫ్లాపులు ఎదురైనప్పుడు నిజాయితీగా ఒప్పుకున్న వర్మ ప్రతీ విషయాన్ని తనకు అనుకూలంగా మర్చుకోవడంలో వర్మ ప్రత్యేకతే వేరు. అలాంటి వర్మ తానో లఫూట్ ని అని బాహాటంగా చెప్పుకోవడం సంచలనంగా మారింది. వివాదం ఎక్కడ వుంటుందో అక్కడ తిష్టవేసుకుని కూర్చునే వర్మ తాజాగా తనపైనే సెటైర్లు వేఉకోవడం ఆసక్తికరంగా మారింది.
`లక్ష్మీస్ ఎన్టీఆర్`తో గత కొన్ని రోజులుగా రచ్చ చేస్తున్న రామ్‌గోపాల్‌వర్మ తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 90ల కాలంలోని ఓ ఫొటోని పోస్ట్ చేసిన వర్మ దానికి క్యాప్షన్‌గా ఆసక్తికరమైన ట్వీట్ చేయడం ఆకట్టుకుంటోంది. ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేసే వర్మ తనన నిజమైన లఫూట్‌గా అభివర్ణించుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
చిరంజీవి, వెంకటేష్, నాగార్జునతో వర్మ మంచి అనుబంధం వుంది. వారితో చాలా జోవియల్‌గా వుండేవారట. ఓ సందర్భంలో వారితో కలిసి వర్మ ఓ మందు పార్టీలో పాల్గొన్నారు. ఆ పార్టీలో వర్మ లవ్ ఇంట్రెస్ట్ శ్రీదేవి కూడా పాల్గొంది. దీనికి సంబంధించిన ఓ ఫొటోని షేర్ చేసిన వర్మ ఆ ఫొటో వెనకున్న ఆసక్తికరమైన కథని బయటపెట్టాడు. చిరంజీవి, వెంకటేష్ తమ చేతుల్లో వున్న మందు గ్లాస్‌లని కనిపించకుండా దాచేస్తే వర్మ, నాగార్జున మాత్రం క్లియర్‌గా కనిపించేలా పట్టుకున్నారు. దీనిపై `చివరి లెఫ్‌లో వున్న మహా లఫూట్ వెధవని నేనే. లెఫ్ట్ అండ్ రైట్ హాండ్స్‌లో గ్లాసులు వున్నాయి. మధ్యలో వున్న వాళ్ల హ్యాండ్స్‌లో వున్నవేవో దాస్తున్నారు. శ్రీదేవిగారి రెండు హ్యండ్సే ఫ్రీగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిజాయితీ నాలోనూ, శ్రీదేవిలోనూ, నాగార్జున లో మాత్రమే వుంది కాబట్టి` అంటూ వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.