ఈ శుక్రవారం బాలకృష్ణ నటించిన మహానాయకుడుతో పాటుగా మరో మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద విడుదలయ్యాయి. మహానాయకుడు సినిమా భారీగా విడుదల కాగా... టాలీవుడ్ నుండి మిఠాయి అనే కామెడీ సినిమాతో పాటుగా... 4 లెటర్స్ అనే అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమా విడుదలవగా.. తమిళ డబ్బింగ్ అంజలి సిబిఐ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద పోటీపడ్డాయి. అయితే బాలకృష్ణ మహానాయకుడు సినిమాకి మాత్రం యావరేజ్ టాక్ రాగా మిగతా మిఠాయి, 4 లెటర్స్ సినిమాకి మాత్రం అట్టర్ ప్లాప్ టాక్ వచ్చింది. అయితే నయనతార ఐపీఎస్ గా నటించిన అంజలి సిబిఐ సినిమాకి మాత్రం హిట్ టాక్ వచ్చింది. కానీ సినిమాకి సరైన ప్రమోషన్స్ లేక ఆ సినిమా మీద ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపలేదు కానీ.. లేదంటే నయనతార సినిమా ఈపాటికి మీడియాలో హాట్ టాపిక్ అయ్యేది.
ఇకపోతే మహానాయకుడు మొదటి రోజు పేలవమైన ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కథానాయకుడు సినిమా ఘోరమైన డిజాస్టర్స్ లిస్ట్ లో చేరగా.. ఇప్పుడు మహానాయకుడు పరిస్థితి అలానే కనబడుతుంది. ఎన్టీఆర్ జీవిత చరిత్రని బాలకృష్ణ తనకి అనుగుణంగా తెరకెక్కించడం వలనే ఈ మహానాయకుడు సినిమాకి కూడా డిజాస్టర్ టాక్ వచ్చిదంటున్నారు. మహానాయకుడు సినిమాలో తన బావ చంద్రబాబు భజన ఎక్కువ కావడం వలనే మహానాయకుడుకి కలెక్షన్స్ రావడం లేదని.. కథానాయకుడులో ఎన్టీఆర్ భజన, మహానాయకుడిలో చంద్రబాబు భజన అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ అన్ని.. మహానాయకుడికి నెగెటివ్ టాక్ పడడానికి కారణమవడం.. అందుకే కలెక్షన్స్ కూడా పూర్ గా ఉండడం జరిగింది. అయితే రెండో రోజు కూడా మహానాయకుడు కలెక్షన్స్ లో పెద్దగా మార్పు కనబడడం లేదు కానీ.... నయనతార నటించిన అంజలి సిబిఐ బుకింగ్స్ మాత్రం కళకళ లాడుతున్నాయి.
మరి అంజలి సిబిఐలో నయనతార సిబిఐ ఆఫీసర్ గా కనబడగా.. రాశిఖన్నా హీరోయిన్ గా నటించింది. సైకో కిల్లర్ అయిన రుద్ర (అనురాగ్ కశ్యప్ ), అంజలి (నయనతార) కి చెప్పి మరీ వరుస హత్యలు చేస్తూ సిబిఐకి సవాలుగా మారుతాడు. అయితే ఆ సైకో కిల్లర్ ని అంజలి ఎలా ఛేజ్ చేసి పట్టుకుంది అనేదే ఆ సినిమా కథ. మరి భారీ సినిమా మహానాయకుడుని కూడా పడుకోబెట్టి... నయనతార అంజలి సిబిఐ సినిమా కలెక్షన్స్ కొల్లగొడుతుంది. అదేగనక సరైన ప్రమోషన్స్ తో అంజలి సిబిఐ బాక్సాఫీసు వద్ద దిగితే.... మహానాయకుడు మాటల్లో కూడా ఉండేది కాదంటున్నారు.