నాని, విక్రమ్ కె. కుమార్ నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నారా? అంటే వాళ్లు తీసుకున్నస్టెప్ తెలిస్తే ఎవరైనా ఇదే మాట అనకతప్పడు. నాని, విక్రమ్ కుమార్‌ల తొలి కలయికలో ఇటీవల ఓ సినిమా పట్టాలెక్కిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీమేకర్స్ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని నటిస్తున్న 24వ చిత్రం కావడంతో బడ్జెట్ కూడా భారీగానే పెట్టేస్తున్నారు మైత్రీవారు. నవలా రైటర్‌గా కొత్త తరహా పాత్రలో నాని కనిపించనున్న ఈ సినిమా ఐదుగురు అమ్మాయిల నేపథ్యంలో ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో సాగుతుందట. కాగా ఆదివారం హీరో నాని పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ని చిత్ర బృందం సాయంత్రం 5గంటలకు రివీల్ చేయబోతోంది.
ఇంతకీ ఈ సినిమాకు ఏటైటిల్ని ఖరారు చేశారని ఆరాతీస్తే షాకింగ్ న్యూస్ బయటపడింది. చిరంజీవి కెరీర్‌లో టాప్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన `గ్యాంగ్ లీడర్` సినిమా టైటిల్నిచిత్ర దర్శకుడు నాని తాజా చిత్రానికి ఖరారు చేసేశారు. 1991లో చిరంజీవి, విజయశాంతి కలయికలో వచ్చిన `గ్యాంగ్‌లీడర్` బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచింది. దర్శకుడు విజయబాపినీడు కెరీర్‌లోనూ భారీ విజయాన్ని అందించిన సినిమాగా నిలిచిపోయింది. అలాంటి సినిమా టైటిల్‌ని నాని వాడుకుంటుండటం మెగా ఫ్యాన్స్‌కి నచ్చడం లేదట. నాని నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నాడంటూ సెటైర్లు వేసేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ సెటైర్లకు నేచురల్ స్టార్ నాని ఎలాంటి సమాధానం చెబుతాడో రేపు ఈవినింగ్ వరకు ఎదురుచూడాల్సిందే.