Advertisementt

‘మహానాయకుడు’లో ఇవెందుకు బాలయ్యా!

Sat 23rd Feb 2019 11:46 PM
balakrishna,ntr biopic,mahanayakudu,rana,chandrababu naidu,biopic  ‘మహానాయకుడు’లో ఇవెందుకు బాలయ్యా!
No Real Incidents in NTR Mahanayakudu ‘మహానాయకుడు’లో ఇవెందుకు బాలయ్యా!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్‌ బయోపిక్‌లో రెండో పార్ట్‌గా రూపొందిన ‘మహానాయకుడు’ చిత్రం తాజాగా విడుదలైంది. బహుశా బాలయ్య కెరీర్‌లోనే అతి చప్పగా విడుదలైన చిత్రం ఇదేనని చెప్పాలి. ‘మణికర్ణిక’ విషయంలో పలు అవమానాలను ఎదుర్కొన్న క్రిష్‌కి ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’ ఎలాంటి మంచి రిజల్ట్‌ని అందించే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ విషయంలో కూడా కొన్ని తగవులు జరిగాయని తాజాగా క్రిష్‌ ఒప్పుకున్నాడు. బాలయ్య బంధువు ఒకరు ఈ చిత్రం షూటింగ్‌ని పర్యవేక్షించారని, కొన్నిసార్లు ఆయనకి తనకి మధ్య విభేదాలు వచ్చాయని క్రిష్‌ తెలిపాడు. అయినా ఇలాంటివి కామనే అని, సినిమాపై ప్రభావం చూపేంత విషయాలు ఇవి కావని క్రిష్‌ వెల్లడించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఈ చిత్రాన్ని చూస్తే మొత్తం బాలయ్య, చంద్రబాబుల కనుసన్నల్లోనే జరిగిందనేది స్పష్టం అవుతోంది. 

ఇక ‘కథానాయకుడు, మహానాయకుడు’ అనేవి ఎన్టీఆర్‌ బయోపిక్స్‌. కానీ ‘మహానాయకుడు’లో మాత్రం ఎన్టీఆర్‌-బసవతారకం మధ్య సీన్స్‌ని ఎక్కువగా ఎలివేట్‌ చేశారు. ఇది ఈ జంటకి చెందిన నిజజీవిత చరిత్ర కాదు. ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర. దాంతో ఎన్టీఆర్‌-బసవతారకం మధ్య ఎక్కువగా ఉన్న ఎమోషన్‌ సీన్స్‌ సినిమాకి అతకలేదు. మరోవైపు ఈ మూవీ ఎన్టీఆర్‌ బయోపిక్‌లా లేదని, నారా చంద్రబాబునాయుడు బయోపిక్‌ అనిపిస్తోందనే విమర్శలు కూడా బాగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే రానా పాత్ర ఎంటర్‌ అయిన తర్వాత ఎన్టీఆర్‌ని, తెలుగుదేశం పార్టీని కేవలం రానానే కనిపెట్టుకుని ఉన్నట్లు చూపారు. ఆయన పాత్రని ఎలివేట్‌ చేయడానికి తీవ్రంగా కష్టపడ్డారు. నాదెండ్ల భాస్కర్‌రావు వెన్నుపోటు తర్వాత మొత్తం చంద్రబాబే మరలా ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యేందుకు చక్రం తిప్పినట్లు చూపించారు. చంద్రబాబు లేకపోతే ఎన్టీఆర్‌కి రాజకీయ జీవితమే లేదనే స్థాయిలో చూపారు. 

రామకృష్ణ స్టూడియోస్‌లో ఎమ్మెల్యేలను దాచడం, ఢిల్లీ తీసుకుని వెళ్లడం వంటివన్నీ చూపించి బాబుని హైలెట్ చేసే విధంగా చేశారు. అందుకే ఈ చిత్రం బాబు బయోపిక్‌ అనే విమర్శలు వచ్చేలా చేశాయి. అసలు ఎన్టీఆర్‌ రెండో పెళ్లి విషయాన్ని ఎక్కడ టచ్‌ చేస్తే లక్ష్మీపార్వతి, బాబుల ఉదంతం చూపించాల్సి వస్తుందనే భయం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఇది అసంపూర్ణమైన బయోపిక్‌గా మిగిలిపోయింది. ఇక వర్మ లక్ష్మీపార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత నుంచే తన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ఉంటుందని చెబుతున్నాడు. సో.. ‘మహానాయకుడు’కి ఇది మూడో పార్ట్‌గా ఉండి, లక్ష్మీపార్వతి ఎపిసోడ్స్‌ నుంచి ఎన్టీఆర్‌ మరణం వరకు సాగితే వర్మది ఈ బయోపిక్‌కి మూడో పార్ట్‌గా మారడంలో ఆశ్చర్యం లేదనే చెప్పాలి. 

No Real Incidents in NTR Mahanayakudu:

Not NTR biopic.. Its Chandrababu Bhajana

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ