Advertisementt

ఒట్టు.. ఈ సినిమా పేరు ‘బొట్టు’

Fri 22nd Feb 2019 08:47 PM
bottu,premisthe bharath,bottu movie,bottu movie release date,namitha,shakeela,g kumar babu  ఒట్టు.. ఈ సినిమా పేరు ‘బొట్టు’
Bottu Movie Release Date Fixed ఒట్టు.. ఈ సినిమా పేరు ‘బొట్టు’
Advertisement
Ads by CJ

మార్చి 8న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన ‘బొట్టు’

‘ప్రేమిస్తే’ ఫేమ్ భ‌ర‌త్‌, న‌మిత, ఇనియా, ఊర్వ‌శి, ష‌కీలా ప్ర‌ధాన తారాగ‌ణంగా వి.సి.వ‌డివుడ‌యాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన చిత్రం ‘బొట్టు’. మార్చి 8న ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఎస్‌.ఎస్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై జి.కుమార్ బాబు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. 

ఈ సంద‌ర్భంగా జి.కుమార్ బాబు మాట్లాడుతూ.. ‘‘తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన కాంచ‌న‌, గంగ చిత్రాల త‌ర‌హాలోనే అద‌ర‌గొట్టే గ్రాఫిక్స్‌తో వ‌స్తోన్న మ‌రో హార‌ర్ కామెడీ యాక్ష‌న్ చిత్ర‌మిది. బొట్టు అనే పేరు గ‌ల ఓ గిరిజ‌న యువ‌తి క‌థ ఇది. క‌థాక‌థ‌నాలు చాలా స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంటాయి. 52 నిమిషాల గ్రాఫిక్స్ మాయాజాలం ఈ చిత్రానికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. సెన్సార్ ఇబ్బందుల కార‌ణంగా చాలా రోజులుగా సినిమా విడుద‌ల నిలిచిపోయింది. చివ‌ర‌కు, రివైజింగ్ క‌మిటీ ద్వారా స‌ర్టిఫికెట్ పొందాం. మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఒక సరికొత్త అనుభూతిని క‌లిగిస్తుంద‌నే ఉద్దేశంతోనే ఈ చిత్రం విడుద‌ల హ‌క్కుల‌ను మేం తీసుకున్నాం. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఫ‌స్ట్ కాపీతో స‌హా విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాం’’ అని తెలిపారు. 

తంబిరామ‌య్య‌, సాయాజీ షిండే, మొట్ట రాజేంద‌ర్‌, మ‌న్సూర్ అలీఖాన్‌, నిరోషా త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్‌, కెమెరా: ఎనియాన్ జె. హ్యారీస్‌, మాట‌లు: ఎం.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, ఫైట్స్: సూప‌ర్ సుబ్బ‌రాయ‌న్‌, ఎడిట‌ర్‌: ఎలీనా, పాట‌లు: శివ‌గ‌ణేష్‌. 

Bottu Movie Release Date Fixed:

Premisthe Bharath New Movie Bottu release on March 8

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ