గత ఏడాది 2018 లో టాలీవుడ్‌కి బాగానే కలిసొచ్చింది. కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే మరి కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అదే ఊపుతో 2019 కూడా ఉంటుందని అంతా భావించారు. 2019 స్టార్టింగ్‌లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన మూడు సినిమాల్లో రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఎఫ్ 2 ఒక్కటి తప్ప. ఎఫ్ 2 చిత్రం రెండు వారాల కిందటి వరకు బాగానే ఆడింది.
ఇక జనవరి తరువాత నెల స్టార్టింగ్‌లో రెండు సినిమాలు వచ్చాయి. అఖిల్ మిస్టర్ మజ్నుతో పాటు, ‘యాత్ర’ కూడా వచ్చింది. రెండు సినిమాల్లో యాత్ర టాక్ పరంగా హిట్ అందుకుంది కానీ వసూల్ పరంగా ఫెయిల్ అయింది. అలానే గతవారంలో వచ్చిన ‘దేవ్’.. ‘లవర్స్ డే’ వీకెండ్ ముగిసేలోపే అడ్రస్ లేకుండా పోయాయి. చెప్పుకోవడానికి తెలుగులో ఏ సినిమాలు లేకపోవడంతో టాలీవుడ్ బాక్సాఫీస్‌లో స్లంప్ నడుస్తోందిప్పుడు.
మరి ఈ పరిస్థితి మారాలంటే ఏదన్నా మంచి సినిమా రావాలి. కానీ సూచనలు ఏమి కనిపించడం లేదు. రెండు రోజుల్లో ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ అవుతుంది. ఈమూవీ పైన ఎటువంటి హోప్స్ లేవు. బుకింగ్స్ చూస్తే పరిస్థితి స్పష్టంగా అర్థమవుతోంది. అలానే ఈ సినిమాతో పాటు ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన డార్క్ కామెడీ ‘మిఠాయి’ ప్రోమోలు బాగానే అనిపించాయి. కానీ ఎటువంటి ప్రమోషన్స్ లేకపోవడంతో సినిమాపై బజ్ లేదు. మరి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కళకళలాడాలంటే ఏ సినిమా తెస్తుందో చూడాలి.