Advertisementt

బెల్లంకొండ ‘రాక్ష‌స‌న్’ చిత్రం మొదలైంది

Thu 21st Feb 2019 10:08 PM
bellamkonda sai srinivas,ramesh varma,havish lakshman koneru,new film launched  బెల్లంకొండ ‘రాక్ష‌స‌న్’ చిత్రం మొదలైంది
Bellamkonda Sai Srinivas New Film Launched బెల్లంకొండ ‘రాక్ష‌స‌న్’ చిత్రం మొదలైంది
Advertisement
Ads by CJ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా.. హ‌వీష్ ల‌క్ష్మ‌ణ్ కొనేరు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా రైడ్‌, వీర చిత్రాల ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో ఎ హ‌వీష్ ల‌క్ష్మ‌ణ్ కొనేరు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కొనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా కొత్త చిత్రం గురువారం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి హ‌వీష్ క్లాప్ కొట్టారు. ప్ర‌ముఖ నిర్మాత కె.ఎల్‌.నారాయణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. 

ఈ సంద‌ర్భంగా నిర్మాత హ‌వీష్ కొనేరు మాట్లాడుతూ.. ‘‘త‌మిళంలో సూప‌ర్‌డూప‌ర్‌హిట్ అయిన రాక్ష‌స‌న్ చిత్రాన్ని తెలుగులో మా బ్యాన‌ర్‌లో చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. మా బ్యాన‌ర్‌లో ప్రెస్టీజియ‌స్‌గా ఈ సినిమాను లావిష్‌గా తెర‌కెక్కించ‌బోతున్నాం. బెల్లంకొండ శ్రీనివాస్‌గారు ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయ‌న త‌న లుక్‌ని మార్చుకున్నారు. ఈ సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌ను ర‌మేష్‌వ‌ర్మ‌గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈరోజు నుండే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంది. గిబ్రాన్ సంగీతం అందిస్తుండ‌గా, వెంక‌ట్ సి.దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మిగ‌తా వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు.

Bellamkonda Sai Srinivas New Film Launched:

Bellamkonda Sai Srinivas and Ramesh Varma Film Launched

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ