Advertisementt

‘మహానాయకుడు’ టీమ్ ఆలోచన ఇలా ఉంది

Thu 21st Feb 2019 09:05 PM
ntr mahanayakudu,balakrishna,krish,promotions,ntr biopic  ‘మహానాయకుడు’ టీమ్ ఆలోచన ఇలా ఉంది
NTR Mahanayakudu Team on Movie Promotions ‘మహానాయకుడు’ టీమ్ ఆలోచన ఇలా ఉంది
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్‌కు అన్నీ సిద్ధమయ్యాయి. కథానాయకుడు డిజాస్టర్ అవ్వడంతో టీం మొత్తం మహానాయకుడు పైనే హోప్స్ పెట్టుకుంది. హోప్స్ పెట్టుకుంటే ఏమి లాభం దానికి తగిన ప్రమోషన్స్ చేయాలి కదా. ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించి ఒక ప్రమోషన్ కూడా చేయలేదు. కథానాయకుడు అప్పుడు అయితే రోజుకొక స్టైల్, టీజర్స్, ఇంటర్వూస్ వంటివి చేసి సినిమాపైన అంచనాలు పెంచేశారు.

కానీ ఆ జోష్ మహానాయకుడు విషయంలో కనిపించడంలేదు. కొన్ని గంటల్లో విడుద‌ల ఉండ‌గా.. ఒక్క ఈవెంట్ కూడా.. కనీసం ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయ‌లేదు బాల‌య్య‌. కనీసం ట్రైలర్ లాంచ్ కూడా చేయలేదు. ఈనెల 22 న వస్తున్నాం అని ప్రకటించారు కానీ ఏ హడావిడి లేదు టీం నుండి. దాంతో బ‌య్య‌ర్లు ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు టాక్‌.

అవసరానికి మించి కథానాయకుడు‌కి పబ్లిసిటీ చేస్తేనే దానికి అంతంత మాత్ర‌మే ఓపెనింగ్స్ వ‌చ్చాయి. ఇప్పుడు ‘మ‌హానాయ‌కుడు’ ప‌బ్లిసిటీ లేకుండా థియేట‌ర్లు ఎలా నిండుతాయ‌న్న‌ది బ‌య్య‌ర్ల ప్ర‌శ్న‌. అయితే ఎన్టీఆర్ టీం మాత్రం వేరేలా ఆలోచిస్తుందట. మొదటి భాగం అంత‌గా ఆడ‌లేదు కాబ‌ట్టి, ఇప్పుడు జ‌నాల‌కు ఏం చెప్పినా ఓవ‌ర్‌గా ఉంటుంద‌ని, సినిమా చూశాకే… అందులో విష‌యం ఉంటే వాళ్లే ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నారు. సినిమాకు మంచి టాక్ వస్తే అప్పుడు ప్రమోషన్స్ చేద్దాం అని అనుకున్నారట. మరి ఇది ఎంతవరకు కరెక్టో వారే ఆలోచించాలి.

NTR Mahanayakudu Team on Movie Promotions:

After Release: NTR Mahanayakudu team plan on promotions 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ