Advertisementt

చాలా పెద్ద పాత్రలో విజయ్ దేవరకొండ

Thu 21st Feb 2019 11:33 AM
vijay devarakonda,father,kranthi madhav,film  చాలా పెద్ద పాత్రలో విజయ్ దేవరకొండ
Vijay Devarakonda plays father in Kranthi Madhav Film చాలా పెద్ద పాత్రలో విజయ్ దేవరకొండ
Advertisement
Ads by CJ

తెలుగులో ప్రస్తుతం సెన్సేషనల్‌, రౌడీస్టార్‌ ఎవరంటే ఠక్కున విజయ్‌ దేవరకొండ పేరు చెబుతారు. నైజాం మెగాస్టార్‌గా ఆయన్ని అందరు ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఈయనని చూసి నేడు యువత పిచ్చెక్కిపోతోంది. ‘పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, గీతగోవిందం, ట్యాక్సీవాలా’ వంటి చిత్రాలతో ఈయన ఫోర్బ్స్‌ జాబితాలోకి ఎక్కాడు. అంతేకాదు.. ఈయన క్రేజ్‌ మెల్లమెల్లగా దక్షిణాది, బాలీవుడ్‌లను కూడా ఆకర్షిస్తోంది. ఇటీవల మోస్డ్‌ డిజైరబుల్‌ మ్యాన్‌ ఎవరు అని చెన్నైలోని ఓ మీడియా సంస్థ సర్వే చేస్తే అక్కడ విజయ్‌కి ఏకంగా మూడో స్థానం లభించడం విశేషం. 

ఇక విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్‌దేవరకొండ ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. దీని తదుపరి ఆయన ఫీల్‌గుడ్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో కె.యస్‌.రామారావు, వల్లభ నిర్మాణంలో చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ కూడా ఆల్‌రెడీ మొదలైంది. ఈ చిత్రంలో ఏకంగా ఐదుగురు హీరోయన్లు ఉంటారట. ఇందులో రాశిఖన్నా, కేధరిన్‌, ఐశ్వర్యారాజేష్‌, ఇజబెల్లిలు ఇప్పటికే ఖరారు అయ్యారు. గోపీసుందర్‌ సంగీతం అందిస్తున్నాడు. 

మరో విశేషం ఏమిటంటే ఈ యంగ్‌ హీరో ఇందులో సింగరేణి కార్మికుడిగా, నాయకునిగానే కాదు... ఏడెనిమిదేళ్ల పిల్లాడికి తండ్రిగా కూడా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇంత యంగ్‌ ఏజ్‌లో ఏడెనిమిదేళ్ల కుర్రాడికి తండ్రిగా నటించడం అంటే మామూలు విషయం కాదు. 

కాగా విజయ్‌ తనకి తమిళనాడులో కూడా ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ‘నోటా’లా మిగిలిన చిత్రాలను కూడా ద్విభాషా చిత్రాలుగా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ‘నోటా’ తమిళనాట ఫర్వాలేదనిపించింది. ఇక ‘అర్జున్‌రెడ్డి’ చియాన్‌ విక్రమ్‌ తనయుడు దృవ్‌ హీరోగా రీమేక్‌ అవుతోంది. చెన్నైలో ‘అర్జున్‌రెడ్డి, గీతగోవిందం’ చిత్రాలు కూడా భారీ కలెక్షన్లు సాధిస్తున్న తరుణంలో విజయ్‌ చేయబోయే తదుపరి చిత్రాలపై ఆసక్తి బాగా పెరుగుతోంది. 

Vijay Devarakonda plays father in Kranthi Madhav Film:

Vijay Devarakonda Turns Father?  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ