Advertisementt

క్రిష్.. ఇదేం బాగా లేదు..!!

Tue 19th Feb 2019 08:14 PM
director krish,ntr mahanayakudu,promotions,manikarnika,ntr kathanayakudu  క్రిష్.. ఇదేం బాగా లేదు..!!
Comments on Krish in Social Media క్రిష్.. ఇదేం బాగా లేదు..!!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ అవ్వడంతో బాలకృష్ణ తో పాటు డైరెక్టర్ క్రిష్ కూడా నిరాశ చెందారు. దాంతో క్రిష్ మీడియా ముందుకు రావడం మానేసాడు. ఇప్పుడు రెండో భాగం మహానాయకుడు రిలీజ్ దగ్గర పడడంతో ఇంతవరకు క్రిష్ కానీ టీం నుండి కానీ ఎటువంటి ప్రమోషన్స్ లేవు. క్రిష్ కనీసం తనవంతు గా సినిమాకి ఎలాంటి ప్రచారం చేయడం లేదు. మహానాయకుడు పై ఎటువంటి బజ్ తీసుకుని రావడంలేదు.

కేవలం ఒక్క పరాజయంతోనే క్రిష్‌ లాంటి పేరు ప్రఖ్యాతులున్న దర్శకుడు అజ్ఞాతవాసం చేయడం సినీ ప్రియులకి నచ్చడం లేదు. మొదటి భాగం ఫెయిల్ అయినప్పుడు రెండో భాగం పై అంచనాలు రేకెత్తించే బాధ్యత దర్శకుడిదే.. కానీ అతనే డీలా పడితే ఎలా అని అంటున్నారు.

ఎన్టీఆర్ కథానాయకుడుతో పాటు బాలీవుడ్ మూవీ మణికర్ణిక విషయంలో జరిగిన పరాభవం క్రిష్‌ని మానసికంగా బాగా కృంగదీసిందని అందుకే ఆయన ఇటువంటి వాటికి దూరంగా ఉంటున్నాడని టాక్. అంతే కాదు బాలకృష్ణ - క్రిష్ కి మధ్య చిన్న గ్యాప్ వచ్చిందనే రూమర్స్ వస్తున్నాయి. క్రిష్ ఒక్కడే కాదు బాలకృష్ణ కూడా ఈసినిమాకి ఎటువంటి ప్రమోషన్స్ చేయడంలేదు.

Comments on Krish in Social Media:

Director Krish no to Promotions for NTR Mahanayakudu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ