Advertisementt

పూరి ఫోకస్ అంతా ఆ హీరోయిన్‌పైనే!

Tue 19th Feb 2019 06:26 PM
nabha natesh,puri jagannadh,ismart shankar,ram,charmi,pokiri  పూరి ఫోకస్ అంతా ఆ హీరోయిన్‌పైనే!
Ismart Shankar Latest Update పూరి ఫోకస్ అంతా ఆ హీరోయిన్‌పైనే!
Advertisement
Ads by CJ

డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ తొలిసారిగా ఓ సినిమా రాబోతుంది. దీనికి ‘ఇస్మాట్ శంకర్’ అనే టైటిల్‌ను పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవ్వనుంది. ఇక ఈచిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేష్.. రామ్‌తో స్టెప్స్ వేయనున్నారు.

అయితే ఈ చిత్రం నుండి తాజా అప్‌డేట్ ఏంటంటే.. ఇందులో హీరోయిన్ నభా నటేష్ క్యారెక్టర్ వినూత్నంగా ఉండబోతుందట. సాధారణంగా పూరి సినిమాల్లో హీరోలకు రాసే క్యారెక్టరైజేషన్‌ను ఈసారి హీరోయిన్‌కి రాశాడట. ఈ పాత్ర చాలా సరదాగా కొత్తగా ఉంటుందని సమాచారం. అయితే నభా పాత్ర సినిమాలో కొద్ది సేపు మాత్రమే ఉంటుందని టాక్.

ఇక ఈ చిత్రానికి ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్రఫీని అందిస్తుండగా.. మణిశర్మ మ్యూజిక్ అందించనున్నారు. పూరితో పాటు ఈ చిత్రాన్ని ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ షెడ్యూల్‌ను ఫినిష్ చేసి రెండో షెడ్యూల్‌కు వెళ్లనుంది టీం.

Ismart Shankar Latest Update:

Heroine Nabha Natesh Highlight in ismart shankar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ