Advertisementt

మొన్న న‌దియా..నిన్న‌ ఖుష్బూ..రేపు..?

Tue 19th Feb 2019 06:18 PM
allu arjun,trivikram,nagma,geetha arts,harika and hasini crietions,trivikram allu arjun film  మొన్న న‌దియా..నిన్న‌ ఖుష్బూ..రేపు..?
trivikram brings nagma for allu arjun film? మొన్న న‌దియా..నిన్న‌ ఖుష్బూ..రేపు..?
Advertisement
Ads by CJ

నిన్న‌టి త‌రం క‌థానాయిక‌ల్ని అమ్మ‌లుగా, అత్త‌లుగా తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఈ వ‌రుస‌లో మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ చాలా కాలం త‌రువాత మ‌ళ్లీ తెలుగు తెర‌పై క‌నిపించ‌బోతోంది.  ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన `అత్తారింటికి దారేది` సినిమాలో న‌దియాను అత్త‌గా చూపించి ఆక‌ట్టుకున్న త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఆ త‌రువాత ప‌వ‌న్‌తో చేసిన `అజ్ఞాత‌వాసి` చిత్రం కోసం చాలా ఏళ్ల త‌రువాత ఖుష్బూను తెర‌పైకి తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఈ సారి ఏకంగా 90ల‌లో త‌న గ్లామ‌ర్‌తో అప్ప‌టి యువ‌తను ఉర్రూత‌లూగించిన గ్లామ‌ర్ డాల్ న‌గ్మాను తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నాడు. 

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా సెట్స్‌పైకి రాబోతున్న విష‌యం తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేస‌న్స్ బ్యాన‌ర్‌పై అల్లు అర‌వింద్‌, ఎస్‌. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. మార్చిలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కొత్త లుక్‌లో క‌నిపించ‌డానికి అప్పుడే క‌స‌ర‌త్తులు మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. కాగా ఈ సినిమాలోని ఓ కీల‌క పాత్ర కోసం ఒక‌ప్ప‌టి గ్లామ‌ర్ క్వీన్ న‌గ్మాను తీసుకోవాల‌ని త్రివిక్ర‌మ్ ప్లాన్ చేస్తున్నార‌ట‌.  

న‌గ్మా తెలుగులో సినిమా చేసి దాదాపు 17 ఏళ్ల‌వుతోంది. ఆమె తెలుగులో న‌టించిన చివరి చిత్రం `నిను చూడ‌క నేనుండ‌లేను`. ఇందులో న‌గ్మ‌  స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది. ఆ త‌రువాత మ‌ళ్లీ తెలుగు తెర‌పై క‌నిపించ‌ని ఆమె భోజ్‌పురి సినిమాల్లో కొన్ని చిత్రాలు చేసి ఆ త‌రువాత కాంగ్రెస్‌లో చేరి క్రియాశీల రాజ‌కీయాల్లో రాణిస్తోంది. అలాంటి న‌గ్మ‌ను మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు త్రివిక్ర‌మ్‌. ఇప్ప‌టికే ఆమెతో సంప్ర‌దింపులు జ‌రిపార‌ని, అయితే న‌గ్మా ఇంకా త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించ‌లేద‌ని తెలిసింది. 

trivikram brings nagma for allu arjun film?:

nagma to play key role in allu arjun film?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ