కింగ్ నాగార్జున.. ఈయనలో ఓ ప్రత్యేకత ఉంది. సీనియర్ డైరెక్టర్ల కంటే యంగ్ అండ్ యూత్ డైరెక్టర్స్‌ని ఈయన బాగా ఎంకరేజ్ చేస్తారు. నాడు రాంగోపాల్‌వర్మ నుంచి ఉప్పలపాటి నారాయణరావు, గీతాకృష్ణ, శివనాగేశ్వరరావు, ఎస్వీకృష్ణారెడ్డి, కృష్ణవంశీ, వైవిఎస్ చౌదరి, ప్రవీణ్‌గాంధీ, తిరుపతి స్వామి, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, ఆర్‌ఆర్‌షిండే, బాలశేఖరన్, దశరథ్, విజయ్‌భాస్కర్, లారెన్స్, పూరీ జగన్నాథ్, వి.యన్. ఆదిత్య, శ్రీనువైట్ల, కిరణ్‌కుమార్, వీరుపోట్ల, రాధామోహన్, విజయేంద్రప్రసాద్, శ్రీనువాస్‌రెడ్డి, వీరభద్రం చౌదరి, విక్రమ్ కె.కుమార్, ఓంకార్, కళ్యాణ్‌కృష్ణ ఇలా ఎందరికో అవకాశం ఇచ్చాడు.
ఇక పరభాషలకు చెందిన మహేష్‌భట్, ప్రతాప్‌పోతన్, ప్రియదర్శన్, ఫాజిల్, మణిరత్నం.. ఇలా ఎన్నో చిత్రాలు చేశాడు. అయితే ఇందులో ఆయన ఎన్ని చిత్రాలలో విజయం సాధించాడో.. కొందరు దర్శకులు ఆయనని అంతగా ఇబ్బంది పెట్టారు. తాజాగా ఈయన ‘చిలసౌ’ దర్శకుడు రాహల్ రవీంద్రన్‌కి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ని అప్పగించాడు. అందునా ఇది నాగార్జున కెరీర్‌లోనే క్లాసిక్ మూవీగా నిలిచిన ‘మన్మథుడు’కి సీక్వెల్ కావడం మరో ప్రత్యేకత. ఇలాంటి చిత్రాలకు సీక్వెల్ చేయాలని భావించడమే పెద్ద రిస్క్. అందునా పెద్దగా అనుభవం లేదని రాహుల్ రవీంద్రన్‌ని నమ్ముకున్నాడు.
నాడు ‘మన్మథుడు’ క్లాసిక్‌గా నిలవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. విజయ్‌భాస్కర్-త్రివిక్రమ్‌ల జోడీ ఊపు మీద ఉండటం, త్రివిక్రమ్ ఇచ్చిన కథ, మరీ ముఖ్యంగా డైలాగ్స్, దేవిశ్రీప్రసాద్ సంగీతం, బ్రహ్మానందం, సునీల్‌ల కామెడీ, నాగ్ రొమాంటిక్ ఇమేజ్ వంటివి దీనికి ప్లస్ అయ్యాయి. కాగా ‘మన్మథుడు 2’ కోసం ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేశారట. నాగార్జున ‘సూపర్’ ద్వారా తెలుగుకి పరిచయమై, ఆ తర్వాత నాగార్జున మీద ఉండే అభిమానంతో ఈయన నటించిన చిత్రాలలో హీరోయిన్‌గానే కాకుండా అతిథి పాత్రలను కూడా చేసిన స్వీటీని ఓ హీరోయిన్‌గా, యంగ్ హీరోయిన్, ఆర్‌ఎక్స్100 బ్యూటీ పాయల్‌రాజ్‌పుత్‌ను ఇందులో మరో హీరోయిన్‌గా తీసుకున్నారని సమాచారం.
‘మన్మథుడు’లో సోనాలిబింద్రే, అన్షులు నాగ్‌కి సరైన జోడీగా మెప్పించారు. మరి ఈ సీక్వెల్‌లో అనుష్క, పాయల్‌రాజ్‌పుత్‌లు అలాగే మెప్పిస్తారో లేదో చూడాలి. మరో విశేషం ఏమిటంటే.. ‘మన్మథుడు’ విజయంలో కీలకమైన పాత్రను పోషించిన సెటైర్ డైలాగ్స్‌లను రాసిన త్రివిక్రమ్‌కి ధీటుగా నేటి తరానికి తగ్గట్లుగా మ్యాజిక్ చేయడంలో రాహుల్ రవీంద్రన్ ఎంతవరకు సక్సెస్ అవుతాడనే విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది.