Advertisementt

అమరవీరుల కుటుంబాలకు ‘మా’ విరాళం

Tue 19th Feb 2019 12:51 PM
maa,support,soldiers,terror attack,pulwama 40 soldiers,dead,thursday  అమరవీరుల కుటుంబాలకు ‘మా’ విరాళం
MAA Donates Rs 5 Lakh to Soldiers అమరవీరుల కుటుంబాలకు ‘మా’ విరాళం
Advertisement
Ads by CJ

పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ‘మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)’ ముందుకొచ్చింది. తమ వంతు సాయంగా 5 లక్షల రూపాయల విరాళాన్ని ‘మా’ ప్రకటించింది. మా అధ్యక్షుడు శివాజీరాజా, జనరల్ సెక్రెటరీ డాక్టర్ వి.కె నరేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జవాన్ల త్యాగం మరువలేనిదని, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే ఉగ్రవాది కారు బాంబుతో దాడి చేసిన విషయం విదితమే. ఆ దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఉగ్రదాడిలో కేవలం ఒక వ్యక్తి(ఆత్మాహుతికి పాల్పడ్డ ఉగ్రవాది) కారణంగా ఇంత భారీ మొత్తంలో జవాన్లు మరణించడం ఇదే తొలిసారి. జవాన్లపై దాడి విషయం తెలిసి యావత్తు భారతావని కన్నీరు పెడుతోంది. అమర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ఇప్పటికే చాలా మంది ముందుకొచ్చి సాయం ప్రకటించారు. సినీ పరిశ్రమ నుంచి కూడా పలువురు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

MAA Donates Rs 5 Lakh to Soldiers:

MAA have Pledged Support to Soldiers After The Terror Attack in Pulwama left at least 40 soldiers dead on Thursday

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ