Advertisementt

నాని, విక్రమ్‌ కె.కుమార్‌ మూవీ మొదలైంది

Mon 18th Feb 2019 08:50 PM
nani and vikram k kumar movie,hero nani,mythri movie makers,koratala siva,nani new movie opening  నాని, విక్రమ్‌ కె.కుమార్‌ మూవీ మొదలైంది
Nani and Vikram K Kumar Movie Launched నాని, విక్రమ్‌ కె.కుమార్‌ మూవీ మొదలైంది
Advertisement
Ads by CJ

నాని, విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ చిత్రం ప్రారంభం 

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం.8 చిత్రం ఫిబ్రవరి 18న ఉదయం 10.49 గంటలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తం షాట్‌కి సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ క్లాప్‌నివ్వగా, శ్రేష్ఠ్‌ మూవీస్‌ అధినేత ఎన్‌.సుధాకర్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అధినేత శరత్‌మరార్‌ స్క్రిప్ట్‌ని అందించారు. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్‌ ఫిబ్రవరి 19 నుంచి నాన్‌స్టాప్‌గా జరుగుతుంది. 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్‌ టైమ్‌ నేను ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీ చేస్తున్నాను. ఎంటర్‌టైన్‌మెంటే కాకుండా ఈ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ కూడా ఉంటుంది. అది ఏమిటనేది స్క్రీన్‌పైన చూస్తేనే బాగుంటుంది. టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో ఉండే సినిమా ఇది’’ అన్నారు. 

మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మా బేనర్‌లో చేస్తున్న మరో విభిన్న చిత్రమిది. సబ్జెక్ట్‌ చాలా బాగుంది. తప్పకుండా అందర్నీ ఆకట్టుకునే సినిమా అవుతుంది. ఈరోజు పూజా కార్యమ్రాలతో సినిమాను ప్రారంభించాం. రేపటి నుంచి నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ జరుగుతుంది’’ అన్నారు. 

నేచురల్‌ స్టార్‌ నాని, కార్తికేయ, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, డార్లింగ్‌ స్వామి, రచనా సహకారం: ముకుంద్ పాండే, పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌: సనత్‌(ఫైర్‌ ఫ్లై) కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌(సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌. 

Nani and Vikram K Kumar Movie Launched:

Nani and Vikram K Kumar Movie Opening Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ