రజనీకాంత్‌గారి కెరీర్‌లో ‘భాషా’ బెస్ట్ మూవీగా ఎలా నిలిచిందో.. నయతారగారి కెరీర్‌లో అలా బెస్ట్ మూవీగా నిలిచిపోయే చిత్రం ‘అంజలి సిబిఐ’ ఆడియో ఆవిష్కరణలో నిర్మాతలు ఆచంట గోపీనాథ్, సి.హెచ్.రాంబాబు
నయనతార టైటిల్ పాత్రలో ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందిన ఇన్‌టెన్సివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇమైక్కా నొడిగల్’. ఈ చిత్రాన్ని సి.జె.జయకుమార్ సమర్పణలో విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్‌పై సి.హెచ్.రాంబాబు, ఆచంట గోపీనాథ్ తెలుగులో ‘అంజలి సిబిఐ’ పేరుతో ఫిబ్రవరి 22న విడుదల చేస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఆడియో సీడీలను ‘గృహం’ ఫేమ్ మిలింద్ రావ్ విడుదల చేయగా, తొలి సీడీని తుమ్మల ప్రసన్నకుమార్ అందుకున్నారు. ఈ సందర్భంగా...
అమ్మిరాజు మాట్లాడుతూ - ‘‘డైరెక్టర్ ఈవీవీగారు, ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన గోపీనాథ్‌గారు ‘జంబ లకిడి పంబ’ సినిమాకు కలిసి పనిచేశారు. అప్పట్లో నేను ఆ సినిమాకు మేనేజర్‌గా పనిచేశాను. ఇన్నేళ్ల తర్వాత ఆయనతో మళ్లీ స్టేజ్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
చిత్ర నిర్మాత సి.హెచ్.రాంబాబు మాట్లాడుతూ - ‘‘తమిళంలో ‘ఇమైక్కా నొడిగల్’ సినిమా చూశాను. చూడగానే నచ్చింది. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఫ్యాన్సీ రేటుతో తెలుగు హక్కులను దక్కించుకున్నాం. తెలుగులో అంజలి సిబిఐ పేరుతో సినిమాను ఫిబ్రవరి 22న విడుదల చేస్తున్నాం’’ అన్నారు.
మిలింద్ రావ్ మాట్లాడుతూ - ‘‘తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తుకి, నిర్మాతలు రాంబాబు, గోపీనాథ్‌గారికి అభినందనలు’’ అన్నారు.
తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ - ‘‘తెలుగులో ఈ సినిమా హక్కుల కోసం చాలా మంది పోటీ పడ్డారు. రాంబాబుగారు, గోపీనాథ్‌గారు మంచి రేటుతో తెలుగు హక్కులను దక్కించుకుని.. ఎక్కువ థియేటర్స్‌లో సినిమాను విడుదల చేస్తున్నారు. రామకృష్ణగారు సినిమాకు అద్భుతమైన సంభాషణలు అందించారు. విజయ్ సేతుపతి, నయనతార, అధర్వ మురళి, రాశీఖన్నా వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటించారు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్‌గా నటించారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా అవుతుందని భావిస్తున్నాను’’ అన్నారు.
చిత్ర దర్శకుడు ఆర్.అజయ్ జ్ఞానముత్తు మాట్లాడుతూ - ‘‘తమిళంలో ఈ సినిమాను తెరకెక్కించడానికి 2 సంవత్సరాల సమయం పట్టింది. అయితే సినిమా రిలీజ్ తర్వాత ఆ కష్టమంతా మరచిపోయే పెద్ద హిట్ అయ్యింది. గోపీనాథ్‌గారు ఈ సినిమా కోసం నన్ను ఎప్పటి నుండో ఫాలప్ చేస్తున్నారు. తమిళంలో సినిమా చూసి అభినందించిన ఆయనే తెలుగులో హక్కులు కొని విడుదల చేయడం ఆనందంగా ఉంది. శ్రీరామకృష్ణగారు అద్భుతంగా సినిమాను తెలుగులో చక్కగా రాశారు. తమిళంలో ఘన విజయం సాధించిన తీరుగానే తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
రైటర్ శ్రీరామకృష్ణ మాట్లాడుతూ - ‘‘గోపీనాథ్ గారితో ఎప్పటి నుండో నాకు పరిచయం ఉంది. ఆయన సీనియర్ ప్రొడ్యూసర్. సినిమా గురించి మాట్లాడాలంటే చూసే ప్రేక్షకులను ఎగ్జయిట్ చేసే చిత్రమిది. ప్రతి ఒక్కరూ ఎంగేజ్ అవుతారు. హృదయాన్ని స్పందింపచేసే కథతోపాటు అద్భుతమైన స్క్ర్రీన్‌ప్లేను రాశాడు దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు. నయనతార చేసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో 50 కోట్లకుపైగా వసూలు చేసి ఆమె కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్‌లా ఈ చిత్రం నిలిచింది. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ సీన్స్, సెంటిమెంట్, లవ్, ప్రతీకారం ఇలా అన్నీ ఎలిమెంట్స్ చక్కగా కుదిరాయి. భాషా అనువాదం చిత్రంతో తెలుగులో రజనీకాంత్ గారికి పెద్ద బ్రేక్ దొరికింది. ఆ సినిమాను విశ్వశాంతి పిక్చర్స్ సంస్థనే తెలుగులో విడుదల చేసింది. మళ్లీ ఇన్నేళ్లకు అంజలి సిబిఐ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సంస్థ చాలా మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటూ గోపీనాథ్ గారికి, రాంబాబు గారికి అభినందనలు’’ అన్నారు.
చిత్ర నిర్మాత ఆచంట గోపీనాథ్ మాట్లాడుతూ - ‘‘భాషా సినిమా రజనీకాంత్‌గారి కెరీర్‌లో బెస్ట్ మూవీగా చెప్పుకుంటారు. అలాగే నయనతారగారి కెరీర్‌లో ఈ చిత్రం నిలిచిపోతుంది. సినిమాలో ప్రతి సీన్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇంత మంచి స్క్ర్రీన్‌ప్లే ఏ సినిమాకూ కుదరలేదు. డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు సినిమాను అద్భుతంగా డైరెక్ట్ చేశారు. టికెట్ కొని సినిమాకు వచ్చే ప్రేక్షకులు వారి డబ్బులు వృథా పోలేదని సంతోషంగా ఇంటికి వెళ్లేంత బాగా సినిమా ఉంటుంది. ఆగస్ట్‌లో ఓ పెద్ద హీరోతో మిలింద్ రావ్ దర్శకత్వంలో ఓ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాం. ఇకపై మా బ్యానర్‌లో వరుస సినిమాలు చేస్తాం’’ అన్నారు.