Advertisementt

శ్రియకు షాకిచ్చిన యంగ్ హీరోయిన్!

Sun 17th Feb 2019 08:30 PM
venkatesh,naga chaitanya,venky mama,heroine,payal rajput  శ్రియకు షాకిచ్చిన యంగ్ హీరోయిన్!
Payal Rajput Replaces Shriya శ్రియకు షాకిచ్చిన యంగ్ హీరోయిన్!
Advertisement
Ads by CJ

కెరీర్ అవసాన దశకు చేరుకున్న టైంలో శ్రియ శరణ్ బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లయినా కానీ గ్లామర్ ని వదిలిపెట్టనని... సినిమాల్లో నటిస్తానని బోల్డ్ స్టేట్మెంట్స్ చాలానే ఇచ్చింది. అలాగే పెళ్లయ్యాక కూడా శ్రియ హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. ఇక సీనియర్ హీరోలకు శ్రియ ఒక్కటే బెస్ట్ ఆప్షన్ గా నిలిచింది. కానీ తాజాగా సీనియర్ హీరోలు కూడా శ్రియని పక్కనబెడుతున్నారు. ఇక పెళ్లయ్యాక బాబీ దర్శకత్వంలో వెంకటేష్ సరసన వెంకీమామ సినిమా చేసే అవకాశం శ్రియని వరించిందనే టాక్ మాములుగా నడవలేదు.

తాజాగా శ్రియ అవకాశాన్ని మరో యంగ్ హీరో తన్నుకుపోయిందనే న్యూస్ వినబడుతుంది. శ్రియకి వచ్చిన అవకాశాన్ని బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ రాజపుత్ చెంతకు చేరిందని చెబుతున్నారు. RX 100 తర్వాత సీత సినిమాలో బెల్లంకొండ సరసన ఐటెం సాంగ్ ఒప్పుకున్నా పాయల్ రాజపుత్... రవితేజకి జోడిగా డిస్కో రాజాలోను ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఇక తాజాగా నాగార్జున సరసన మన్మధుడు 2 లోను పాయల్ పేరు వినబడుతుండగా..... లేటెస్ట్ గా వెంకటేష్ సరసన పాయల్ రాజపుత్ వెంకీమామలో నటించబోతుందని అంటున్నారు.

ఫిబ్రవరి 22 న షూటింగ్ మొదలుపెట్టుకోనున్న వెంకీమామ సినిమా  పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాలో నాగ చైతన్యకి జోడిగా రకుల్ ప్రీత్ నటిస్తుండగా... వెంకటేష్ సరసన హాట్ గర్ల్ పాయల్ పేరు వినబడుతుంది. ఇక వెంకీమామలో పాయల్ రాజపుత్ హీరోయిన్ గా నటించడం ఖాయమని.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని చెబుతున్నారు.

Payal Rajput Replaces Shriya:

Payal Rajput in Venkatesh and Naga Chaitanya Venky Mama

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ