Advertisementt

‘మహానాయకుడు’ ట్రైలర్: కిక్కు ఎక్కలేదా?

Sun 17th Feb 2019 08:22 PM
balakrishna,ntr mahanayakudu,trailer,release  ‘మహానాయకుడు’ ట్రైలర్: కిక్కు ఎక్కలేదా?
Mahanayakudu Trailer Released ‘మహానాయకుడు’ ట్రైలర్: కిక్కు ఎక్కలేదా?
Advertisement

మహానాయకుడు ప్రమోషన్ మొదలైపోయాయి. నిన్నమొన్నటివరకు చడీ చప్పుడు లేని మహానాయకుడు టీం ఇప్పుడు వేగాన్ని పెంచింది. కథానాయకుడు విడుదలకు ముందున్న క్రేజ్ మహానాయకుడు విడుదల ముందు రావడం లేదు. ప్రమోషన్స్ లో లేట్ కారణం, ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ కావడంతో.. ఎన్టీఆర్ మహానాయకుడు మీద ప్రేక్షకుల్లో ఆసక్తి కలగడం లేదు. మహానాయకుడు ఫిబ్రవరి 22 న విడుదలవుతుందని.. ఒక రోజంతా సినిమా పోస్టర్స్ తో హంగామా చేసిన మహానాయకుడు టీం... రెండో రోజు మహానాయకుడు ట్రైలర్ రిలీజ్ అంటూ పోస్టర్స్ తో పాటుగా సాయంత్రానికల్లా మహానాయకుడు ట్రైలర్ ని విడుదల చేసింది. కథానాయకుడు ట్రైలర్ రిలీజ్ అనగానే సోషల్ మీడియా మొత్తం ఎదురు చూడడమే కాదు.. నందమూరి ఫ్యాన్స్ తెగ హడావిడి చేశారు. కానీ మహానాయకుడు ట్రైలర్ వస్తుంది అంటే.. సోషల్ మీడియాలో ఎటువంటి హడావిడి లేదు.. అలాగే నందమూరి ఫ్యాన్స్ హడావిడి కనబడినా అంతగా ఎక్కడా ఫోకస్ అవ్వలేదు.

ఇక కథానాయకుడు ట్రైలర్ చూసిన ప్రతిఒక్కరు కథానాయకుడు విడుదల కోసం వెయిటింగ్ అన్నవారు.. మహానాయకుడు ట్రైలర్ చూసాక చాలా చప్పగా ఉందంటూ పెదవి విరుస్తున్నారు. కథానాయకుడులో బాలకృష్ణ, ఎన్టీఆర్ గా ఆకట్టుకుంటే.. మహానాయకుడిలో రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ లా బాలకృష్ణ అంతగా నప్పలేదంటున్నారు. ఇక మహానాయకుడు ట్రైలర్ మొత్తం రాజకీయాల చుట్టూనే చూపించాడు. అయితే అక్కడక్కడా ఎమోషన్, బాధ లాంటివి కలిపాడు కానీ... ఎందుకో కథానాయకుడు మీద ఉన్న ఇంట్రెస్ట్ మహానాయకుడు మీద కలగడం లేదు అనేది వాస్తవం. అలాగే మహానాయకుడు విడుదలకు కేవలం ఆరు రోజులే ఉన్నప్పటికీ... ఆ సినిమా మీద ప్రేక్షకుల్లోనూ ఇసుమంత ఇంట్రెస్ట్ కలగడం లేదు. ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ కావడమే మహానాయకుడుపై ఇంట్రెస్ట్ కలగకపోవడానికి మెయిన్ కారణం.

అసలే మహానాయకుడు ప్రమోషన్స్ వీక్ గా ఉండి.. సినిమా మీద శక్తి పెరగడం లేదు అంటే.. ఇప్పుడు మహానాయకుడు ట్రైలర్ చూసాక కాస్తో కూస్తో ఉన్న ఆసక్తి సన్నగిల్లిందని... మహానాయకుడు ట్రైలర్ మొత్తం ఎన్టీఆర్ రాజకీయాలతో ఎంతగా సతమత మయ్యాడో చూపించిన క్రిష్... చంద్రబాబు కేరెక్టర్ ని ఎలా మలిచాడో అనేది కాస్తో కూస్తో ఇంట్రెస్ట్ ని కల్గించే అంశం. అయితే చంద్రబాబు పాత్ర కన్నా ఎక్కువగా.. ఈ సినిమాలో నాదెండ్ల కేరెక్టర్ హైలెట్ అయ్యేలా కనబడుతుంది.. మహానాయకుడు ట్రైలర్ చూసాక. మరి సినిమాలో కావాల్సిన పాయింట్స్ మిస్ కాకపోతే సినిమా ఆటోమాటిక్ గా హిట్ అవుతుంది. ఇక మహానాయకుడు ప్రమోషన్స్ పీక్స్ లోకి వెళ్ళాలి. లేదంటే కేవలం ఐదు రోజుల్లోనే మహానాయకుడు మీద ప్రేక్షకులలో శక్తి కలిగించడం కష్టం. అలాగే సినిమా విడుదలై పాజిటివ్ టాక్ వస్తే.. మౌత్ టాక్ తో సినిమా హిట్ అవుతుంది.. లేదంటే కష్టం సుమీ...!

Mahanayakudu Trailer Released:

Mahanayakudu Trailer not Reached Expectations

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement