Advertisementt

రకుల్‌ పాత పరిచయాలను తోడుతోందట!

Sun 17th Feb 2019 12:18 PM
rakul preet singh,old movies,heroes,karthi,dev movie  రకుల్‌ పాత పరిచయాలను తోడుతోందట!
Rakul Preet Singh in Dilamma రకుల్‌ పాత పరిచయాలను తోడుతోందట!
Advertisement
Ads by CJ

నిజానికి పాతకాలంలో సావిత్రి, జమున, భానుమతి, కృష్ణకుమారి నుంచి శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయశాంతి వంటివారు ఎంతోకాలం స్టార్‌ హీరోయిన్లుగా వెలిగారు. నేడు కూడా నయనతార, అనుష్క, కాజల్‌, సమంత, తమన్నా, శ్రియ వంటి వారు బాగానే నెట్టుకొస్తున్నారు. కానీ రెండేళ్ల కిందట స్టార్‌ హీరోయిన్‌గా చక్రం తిప్పి, యంగ్‌స్టార్స్‌ అందరితో దాదాపు నటించిన రకుల్‌ప్రీత్‌సింగ్‌ మాత్రం అతి తక్కువ కాలంలోనే ఫేడవుట్‌ అయింది. గత ఏడాది ఈమెకి తెలుగులో ఒక్క చాన్స్‌ కూడా రాలేదు. ‘ఖాకీ’ చిత్రంలో కార్తి సరసన ఫస్ట్‌హాఫ్‌కే పరిమితమైన పాత్రలో నటించింది. 

తాజాగా ఆమె మరోసారి కార్తీతో ‘దేవ్‌’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో యునానిమస్‌గా డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. కథ, కథనం, పాత్రధారులు, సాంకేతిక నిపుణులు, సంగీతం ఇలా ఏవీ మెప్పించే స్థాయిలో లేవు. ముఖ్యంగా ఈ మూవీలో రకుల్‌ని చూసి ఆమె అభిమానులే తట్టుకోలేకపోతున్నారు. ఇందులో ఆమె మునుపెన్నడు లేనంత డల్‌గా కనిపిస్తూ ఉసూరుమనిపించింది. ఇక ఆమె మేకప్‌ మరీ ఎబ్బెట్టుగా ఉంది. క్లోజప్‌ షాట్స్‌లో ఆమె భయంకరంగా కనిపించింది. నెగటివ్‌ లుక్స్‌తో ఆకారం కూడా ఆకట్టుకునేలా లేదు. దాంతో ‘దేవ్‌’ హిట్టయితే మరలా తాను కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో సత్తా చాటుతానని చెప్పిన ఆమె ఆశలు అడియాసలే అయ్యాయి. 

ఇక ప్రస్తుతం ఈమె కార్తి సోదరుడు సూర్యతో కలసి ‘ఎన్జీకే’లో నటిస్తోంది. ఇందులో సాయిపల్లవి కూడ నటిస్తుండటంతో రకుల్‌కి పెద్ద సీన్‌ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇలాంటి సమయంలోనే ఆమె తన పాత పరిచయాల ద్వారా తెలుగులో అవకాశాలు సాధించుకోవాలనే ఆలోచనతో ఉంది. ఈమె నాగచైతన్యకి పెద్ద హిట్‌గా నిలిచిన ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’తో ఉన్న పరిచయంతో ‘వెంకీమామ’లో నాగచైతన్య సరసన చాన్స్‌ దక్కించుకుంది. బోయపాటి శ్రీను తీసిన ‘జయ జానకి నాయక’లో నటించి మరోసారి బోయపాటి తీయనున్న బాలకృష్ణతో, ఇక ‘జయ జానకి నాయక’లో నటించిన హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ చలవతో ఆయనతో మరో చిత్రంలో స్థానం కోసం ప్రయత్నిస్తోంది. అందుకే సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అనే సామెత నిజమనిపిస్తుంది. 

Rakul Preet Singh in Dilamma :

Rakul Preet Singh eye on Her Old movies Heroes

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ