Advertisementt

మ‌ళ్లీ మ‌న‌సు దోచేసిన `అర్జున్‌రెడ్డి`!

Sat 16th Feb 2019 08:17 PM
vijay deverakonda,crpf jawans,vijay helps to crpf families,pulwama incident,pulwama terror attack  మ‌ళ్లీ మ‌న‌సు దోచేసిన `అర్జున్‌రెడ్డి`!
vijay devarakonda support to crpf families మ‌ళ్లీ మ‌న‌సు దోచేసిన `అర్జున్‌రెడ్డి`!
Advertisement
Ads by CJ

గ‌తంలో కేర‌ళ వ‌ర‌ద బాదితుల కోసం ముందుగా విరాళం ప్ర‌క‌టించి ఆద‌ర్శంగా నిలిచిన విజ‌య్ దేవ‌ర‌కొండ. మ‌ళ్లీ త‌న గొప్ప మ‌న‌సును చాటుకుని అంద‌రి మ‌న‌సు దోచేసుకున్నాడు. కెరీర్ తొలి నాళ్ల నుంచి ఏది చేసినా కొత్త‌గా చేస్తూ న‌లుగురిని ఆలోచింప‌జేస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌ తాజాగా మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచారు. పుల్వామాలో మాన‌వ బాంబు దాడిలో 43 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్లు అమ‌రులైన విష‌యం తెలిసిందే. అంతా వారికి సంతాపం తెలుపుతుంటే విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్రం వారి కుటుంబాల‌కు అర్థిక స‌హాయాన్ని అందించ‌డం ఆస‌క్తిక‌రంగాగా మారింది. విజ‌య్ పెద్ద మ‌న‌సుకు నెటిజ‌న్‌లు అంతా ఫిదా అయిపోతున్నారు. సోష‌ల్ మీడియాలో అత‌నిపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. 

`అర్జున్‌రెడ్డి` సినిమాతో ఒక్క‌సారిగా స్టార్ అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఎంత ఎదిగినా ఒదిగి వుంటూ మ‌న‌సెరిగి మ‌స‌లుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది. గ‌తంలో కేర‌ళ వ‌ర‌ద బాదితుల కోసం ఇలాగే స్పందించి అంద‌రిని ఆక‌ట్టుకున్న విజ‌య్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లో పెట్టిన పోస్టుకు అంతా ఫిదా అయిపోతున్నారు. `జ‌వాన్లు మ‌న కుటుంబాల్ని ర‌క్షిస్తున్నారు. ఈ క‌ష్ట‌కాలంలో మ‌నం వారి కుటుంబాల‌కు అండ‌గా నిలుద్దాం. సైనికుల జీవితాల‌ను సాయంతో వెల‌క‌ట్ట‌లేము కానీ దేశం కోసం ప్రాణాల‌ర్పిస్తున్న వారికి మ‌నం మ‌న వంతు స‌హ‌కారాన్నిఅందిద్దాం. అందుకే నా వంతు స‌హ‌కారం అందించా. మ‌నంద‌రం క‌లిసి సాయం చేద్దాం. మ‌న‌మంతా క‌లిసి వారికో పెద్ద మ‌ద్ద‌తును సృష్టిద్దాం` అంటూ ట్విట్ట‌ర్‌లో విజ‌య్ పెట్టిన పోస్ట్  వైర‌ల్‌గా మారింది. 

vijay devarakonda support to crpf families:

vijay devarakonda financial support to crpf families

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ