టాలీవుడ్‌లో రియల్‌లైఫ్‌లో రెబెల్‌స్టార్, ముక్కోపి, అంతా నా ఇష్టం అనేట్లు ఉండే నటుడు మోహన్‌బాబు. ఈయన స్వర్గీయ ఎన్టీఆర్‌కి, దాసరికే కాదు... రజనీకాంత్, స్వర్గీయ అంబరీష్, పరిటాల రవి.. ఇలా ఎందరికో ముఖ్యుడు. ఎన్టీఆర్ తన సొంత అన్నయ్య అని చెప్పుకునేవాడు. అందుకే ఎన్టీఆర్ తన ఆరోగ్యం సహకరించకపోయినా తన చివరి రోజుల్లో మోహన్‌బాబుకి ‘మేజర్ చంద్రకాంత్’ వంటి చిత్రం చేశాడు. ఈ చిత్రం శతదినోత్సవ వేడుక సందర్భంగానే.. ఎన్టీఆర్ అదే వేదికపై లక్ష్మీపార్వతిని నా భార్య అంటూ పరిచయం చేశాడు. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిల కలయికలో కూడా మోహన్‌బాబుకి పెద్ద పాత్రే ఉందని అంటారు.
ఇక ఎన్టీఆర్ చివరిరోజుల్లోనే కాదు.. వైస్రాయ్ ఉదంతం, ఎన్టీఆర్ పదవీచితుడు కావడం, లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్‌లని ఒకటి చేయడం, ఎన్టీఆర్ మరణం తర్వాత లక్ష్మీపార్వతికి అండగా ఉండటం వంటి వాటిల్లో మోహన్‌బాబు పాత్ర ఎంతో ఉంది. నాడు కొన్ని పత్రికలు ఎన్టీఆర్ ద్వారా లక్ష్మీపార్వతిని సంపాదించుకున్న సొమ్ము మోహన్‌బాబు తన వశం చేసుకున్నాడని, తాజాగా దాసరి విషయంలో కూడా మోహన్‌బాబు ఇదే చేశాడని వార్తలు రాసింది. దీనిని నిజమేనని కొందరు అంటూ ఉంటారు. ఇక లక్ష్మీపార్వతి-మోహన్‌బాబులకి మధ్య చెడిన తర్వాత లక్ష్మీపార్వతి ఓ ఇంటర్వ్యూలో మోహన్‌బాబు మోసగాడని వ్యాఖ్యానించింది.
ఇక తాజాగా వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్‌లో మోహన్‌బాబుని పోలిన పాత్ర కనిపిస్తోంది. ఇక వర్మకి మంచు ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఉంది. మోహన్‌బాబుతో ‘రౌడీ’, మంచు విష్ణుతో ‘అనుక్షణం’, మంచు మనోజ్‌తో ‘ఎటాక్’ చిత్రాలు తీశాడు. మరి లక్ష్మీపార్వతి కోణంలో తీసే చిత్రం కావడంతో ఆమె అభిప్రాయం ప్రకారం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో మోహన్‌బాబు పాత్రని ఎలా చూపిస్తాడో వేచిచూడాల్సివుంది. మోహన్‌బాబుని ఇందులో నమ్మకద్రోహిగా, అందునా లక్ష్వీపార్వతి చెప్పినట్లు మోసగాడుగా చూపించే సీన్స్ ఉంటాయో లేదో చూడాలి...!