Advertisementt

ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌లో చేద్దామనుకున్నా: కల్యాణ్‌రామ్

Sat 16th Feb 2019 04:33 PM
118,118 trailer release,118 movie,kalyan ram,nivetha thomas,kv guhan,mahesh koneru,118 trailer launch highlights  ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌లో చేద్దామనుకున్నా: కల్యాణ్‌రామ్
118 Movie Trailer Release Event Details ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌లో చేద్దామనుకున్నా: కల్యాణ్‌రామ్
Advertisement

‘118’ ట్రైలర్‌ లాంచ్‌ 

డైనమిక్‌ హీరో నందమూరి కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటిస్తోన్న స్టైలిష్‌ యాక్షన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘118’. నివేదా థామస్‌, షాలిని పాండే హీరోయిన్స్‌గా నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.వి.గుహన్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ కొనేరు నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. 

ఈ సందర్భంగా మిర్చి కిరణ్‌ మాట్లాడుతూ.. ‘‘నేను ఈ సినిమాకు డైలాగ్‌ రైటర్‌గా పనిచేశాను. ట్రైలర్‌ చూడటానికి స్లిక్‌గా, స్టయిలిష్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఎలా ఉందో.. మొత్తం సినిమా అంతా ఇలానే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సినిమా గురించి తెలిసినా.. మళ్లీ సినిమా చూడాలనే ఆసక్తి తగ్గడం లేదు. సీట్‌ ఎడ్జ్‌ మూమెంట్స్‌ చాలానే ఉన్నాయి. కల్యాణ్‌రామ్‌గారు స్టైలిష్‌గా కనపడుతున్నారు. రైటింగ్‌ టైమ్‌లో సినిమా అనుకున్న దాని కంటే సూపర్బ్‌గా వచ్చింది. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు. 

మ్యూజిక్‌ డైరెక్టర్‌ శేఖర్‌చంద్ర మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నన్ను భాగం చేసిన కల్యాణ్‌రామ్‌గారికి, నిర్మాత మహేష్‌ కొనేరుగారికి థ్యాంక్స్‌. చాలా సినిమాలు చేస్తుంటాం. కానీ ఇలా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి స్కోప్‌ ఉన్న సినిమాలు రావడం అరుదుగా జరుగుతుంటాయి. గుహన్‌గారితో పనిచేయడం వల్ల చాలా విషయాలను నేర్చుకున్నాను. సినిమాలో చాలా ఇన్‌టెన్‌సిటీ ఉంది. చాలా ఎమోషన్స్‌ ఉన్న ఇన్‌టెన్స్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. హీరో నుండి పాజిటివిటీ, ఎనర్జీ సినిమా అవుట్‌పుట్‌ బాగా రావడానికి తోడ్పడింది. చందమామే సాంగ్‌ ఇప్పటికే చాలా పెద్ద హిట్‌ అయ్యింది. సపోర్ట్‌ చేసిన అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు. 

నివేదా థామస్‌ మాట్లాడుతూ.. ‘‘నాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించిన చిత్రమిది. తక్కువ టైంలో చాలా ఎక్కువగా వర్క్‌ చేసిన సినిమా. చాలా హార్డ్‌ వర్క్‌తో యూనిట్‌ ఈ సినిమాను పూర్తి చేశాం. సినిమాలో చాలా పొటెన్షియల్‌ ఉంటుంది. అసలు 118 ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సీనియర్‌ సినిమాటోగ్రాఫర్‌గా పేరున్న గుహన్‌ సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించారు. సినిమా అందరికీ నచ్చుతుంది. ఎంటైర్‌ యూనిట్‌కు థ్యాంక్స్‌’’ అన్నారు. 

నిర్మాత మహేష్‌ కొనేరు మాట్లాడుతూ.. ‘‘కల్యాణ్‌రామ్‌గారికి, గుహన్‌గారికి చాలా థ్యాంక్స్‌. ఎందుకంటే చాలా మంచి సినిమాను ఇచ్చారు. కొన్ని సినిమాలు చేసేటప్పుడు మనకు చాలా సంతృప్తిగా అనిపిస్తాయి. అలాంటి సంతృప్తినిచ్చిన సినిమా ఇది. నాకు చాలా స్పెషల్‌ మూవీ అని చెప్పుకోవడానికి గర్వంగా అనిపిస్తుంది. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. కల్యాణ్‌రామ్‌గారి నటన, గుహన్‌గారి టేకింగ్‌, నివేదా, షాలినిగారి నటన .. ఇలా అన్నీ అద్భుతంగా కుదిరాయి. శేఖర్‌ చంద్రగారు అద్భుతమైన సంగీతంతో పాటు ఎక్స్‌ట్రార్డినరీ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. మార్చి 1న సినిమా విడుదలవుతుంది’’ అన్నారు. 

చిత్ర దర్శకుడు కె.వి.గుహన్‌ మాట్లాడుతూ.. ‘‘మంచి కథతో మిళితమైన థ్రిల్లర్‌ సినిమా ఇది. తెలుగులో చాలా మంచి చిత్రాలు వస్తున్నాయి. ఇలాంటి సినిమాల్లో నేను కూడా ఒక భాగం కావాలని అనుకున్నాను. నేను కథ చెప్పగానే మొదటిసారే సినిమాకు ఓకే చెప్పేశారు. ఎంతగానో సపోర్ట్‌ అందించారు. నాకు సపోర్ట్‌ చేసిన అందరికీ థ్యాంక్స్‌. సినిమాటోగ్రాఫర్‌ నుండి దర్శకుడిగా మారిన తర్వాత ఓ టీం సినిమా కోసం ఎంత కష్టపడతారో ఇంకా బాగా అర్థమైంది. సినిమాలో భాగమైన అందరికీ థ్యాంక్స్‌. ఎడిటర్ తమ్మిరాజుగారు చక్కటి గైడెన్స్‌ ఇచ్చారు. శేఖర్‌ చంద్ర తన మ్యూజిక్‌తో ఒక స్పేస్‌ క్రియేట్‌ చేశారు. ఇలాంటి సినిమాకు రీరికార్డింగ్‌ చాలా కీలకంగా ఉంటుంది. అలాంటి రీరికార్డింగ్‌ అందించడానికి శేఖర్‌ చంద్ర ప్రయత్నిస్తున్నారు. నివేదా ఓ బాధ్యతాయుతమైన పాత్రలో నటించింది. సినిమా కథంతా ఆమె చుట్టునే తిరుగుతుంది. పాత్రలోకి లీనమైపోయింది. సినిమా రిలీజ్‌ తర్వాత తన గురించి అందరూ మాట్లాడుకునేంత గొప్పగా నటించింది. అర్జున్‌రెడ్డి తర్వాత షాలిని నటించిన చిత్రమిది. ఇక కల్యాణ్‌రామ్‌ గురించి చెప్పాలంటే .. ముందు రోజే ఏం చేయాలి? ఎలా చేయాలి? అని డిస్కస్‌ చేసుకుని ప్రిపేర్‌ అయ్యి వచ్చేవాడు. ఓ వ్యక్తిగా ఎంతగానో సపోర్ట్‌ అందించారు. నిర్మాత మహేష్‌గారికి థ్యాంక్స్‌. ఎందుకంటే కథ వినగానే ఎగ్జయిట్‌మెంట్‌తో తనవంతు సపోర్ట్‌ ఇచ్చారు’’ అన్నారు. 

నందమూరి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్‌ను లోతుగా అబ్జర్వ్‌ చేస్తే సినిమా ఏంటో అర్థమైపోతుంది. నివేదా థామస్‌గారికి థ్యాంక్స్. ఆమెను బేస్‌ చేసుకునే మొత్తం కథంతా రన్‌ అవుతుంది. మంచి పెర్ఫామెన్స్‌ ఇచ్చారు. కంటితడి పెట్టించారు. ఆమెకు ఈ సందర్భంగా థ్యాంక్స్‌. గుహన్‌గారు ఈ సినిమాలో నాలుగు బాధ్యతలు నిర్వహించారు. స్టోరీ, స్క్రీన్‌ప్లే విషయానికి వస్తే.. చాలా ఎగ్జయిట్‌ అయ్యాం. ఈ కథ ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. కానీ మనం పట్టించుకోం.. వదిలేస్తాం. కథ చెప్పగానే నేను కూడా కనెక్ట్‌ అయ్యాను. అందుకనే సినిమా చేయడానికి వెంటనే ఓకే చెప్పేశాను. గుహన్‌గారి సినిమాటోగ్రఫీ గురించి నేను చెప్పేంత పెద్దవాడిని కాను. కానీ.. డైరెక్షన్‌ విషయానికి వస్తే ఓ ప్లానింగ్‌తో వర్క్‌ చేసుకుంటూ వచ్చారు. ఆర్టిస్ట్‌గా అందరినీ ఫీలై నటించమని చెప్పారు. ఎలాంటి రిస్ట్రిక్షన్‌ లేకుండా చేయించారు. ఈ సినిమాకు పనిచేసే క్రమంలో ఆయన కొత్త దర్శకుడనే భావనే కలగలేదు. నిర్మాత మహేష్‌ నాకు కుటుంబ సభ్యుడితో సమానం. ముందు ఈ కథను ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌లో చేద్దామనేంత బాగా నచ్చింది. అయితే మహేష్‌గారు లైట్‌గా కథవిని పూర్తి కథ వినొచ్చా? అన్నారు. వినమని నేను చెప్పాను. వినగానే నేను ఎగ్జయిట్‌ అయినంతగా తను ఎగ్జయిట్‌ అయ్యి సినిమా చేయడానికి రెడీ అయ్యారు. కిరణ్‌గారు చాలా చక్కటి డైలాగ్స్‌ అందించారు. శేఖర్‌ చంద్ర ఎక్సలెంట్‌ మ్యూజిక్‌ అందించారు. రీరికార్డింగ్‌ ఇంకా అద్భుతంగా ఇస్తున్నారు. తమ్మిరాజుగారు బ్యాక్‌బోన్‌లా నిలిచి సపోర్ట్‌ చేశారు. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ థ్యాంక్స్‌. మార్చి 1న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమా చూసి నాలానే అందరూ ఎగ్జయిట్‌ అవుతారని భావిస్తున్నాను..’’ అన్నారు.

118 Movie Trailer Release Event Details:

Celebrities Speeches at 118 Movie Trailer Launch

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement