Advertisementt

మళ్లీ అరవింద భామకే ఓటేసిన త్రివిక్రమ్

Sat 16th Feb 2019 11:11 AM
pooja hegde,heroine,allu arjun,trivikram srinivas,next movie  మళ్లీ అరవింద భామకే ఓటేసిన త్రివిక్రమ్
Heroine selected for Trivikram and Bunny Film మళ్లీ అరవింద భామకే ఓటేసిన త్రివిక్రమ్
Advertisement
Ads by CJ

వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన పూజాహెగ్డే ఆ తరువాత అసలు కనిపించడం మానేసింది. మళ్లీ చాలా ఏళ్ళ తరువాత బన్నీతో డిజెలో నటించింది. లేటెస్ట్ గా అరవింద సమేతలో నటించి అందరి మనసులు దోచుకున్న పూజా ఇప్పుడు ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాతో పాటు మహేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.

మహేష్ తో మహర్షి సినిమాలో నటిస్తున్న పూజాకు త్రివిక్రమ్ నుండి మరో ఆఫర్ వచ్చింది. త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో పూజాని దాదాపు కన్ఫర్మ్ చేసినట్టు టాక్. త్రివిక్రమ్ వన్ సైడ్ గా హీరోయిన్ పూజా పేరు సజెక్టు చేయడం దానికి బన్నీ కూడా ఓకే చెప్పడం రెండు ఒకేసారి జరిగిపోయాయి.

బన్నీ లాంటి స్టార్ హీరో పక్కన షార్ట్ టైమ్ లో హీరోయిన్ ను రిపీట్ చేయడం అరుదుగా జరుగుతుంటుంది. ఇందులో ఈమె పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా కొత్తగా ఉంటుందని టాక్. ఏదిఏమైనా పూజాకి తెలుగులో వరుస అవకాశాలు రావడం మామూలు విషయం కాదు. పైగా ఈమెకు తెలుగు కూడా అర్ధం అవుతుందని మన డైరెక్టర్స్ ఈమెనే ప్రిఫర్ చేసుకుంటున్నారు.

Heroine selected for Trivikram and Bunny Film:

Again Pooja hegde in Trivikram Srinivas Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ