సంకాంత్రి వెళ్ళింది మొదలు బాక్సాఫీసు వద్ద సరైన సినిమానే లేదు. గతవారం విడుదలైన యాత్ర సినిమాకి పాజిటివ్ టాకొచ్చినప్పటికీ.. ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను శాటిస్ఫాయ్ చెయ్యలేకపోయింది. ఒక నెల నుండి చాలా డల్ గా వున్న బాక్సాఫీసు వద్దకి నిన్న ప్రేమికుల రోజు సందర్భంగా రెండు డబ్బింగ్ సినిమాలు పోటీపడ్డాయి. అందులో ఒకటి తమిళ డబ్బింగ్ దేవ్ సినిమా, రెండోది మలయాళ డబ్బింగ్ లవర్స్ డే సినిమా. మరి రెండు సినిమాలు ప్రేమకథ చిత్రాలు కావడంతో సినిమాల మీద ప్రేక్షకులు కాస్తో కూస్తో ఆసక్తిని చూపారు. అందులోను నెలరోజులుగా ఇంట్రెస్టింగ్ గా లేని బాక్సాఫీసు ఈసారైనా కళకళలాడుతుంది అని అనుకున్నారు.
కానీ ఈ వారం కూడా చాలా నిస్తేజంగా కనబడుతుంది. తమిళ డబ్బింగ్ అయిన దేవ్ సినిమా కాస్త అంచనాలు తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీకి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. అలాగే హీరోయిన్ రకుల్ ప్రీత్ కూడా తెలుగు నుండే తమిళ్ కి వెళ్లిన హీరోయిన్ కావడంతో సహజంగానే దేవ్ సినిమా మీద తెలుగు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ పెట్టారు. దేవ్ సినిమాని రంజిత్ రవిశంకర్ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసాడు. అయితే కొత్త దర్శకుడు కావడంతో.. సినిమాలో డైరెక్షన్ లోపాలు అడుగడుగునా కనిపిస్తాయి. సినిమా విడుదలైన మొదటి షోకే సినిమాకి నెగెటివ్ టాక్ రావడం, సినిమాలో కంటెంట్ లేకపోవడంతో విశ్లేషకులు కూడా దేవ్ సినిమాకి చాలా మైనస్ మార్కులే ఇచ్చారు. డిజప్పాయింట్ రివ్యూస్ తో దేవ్ సినిమాకి నెగెటివ్ టాక్ పడిపోయింది.
సినిమాలో కథ, కథనం, డైరెక్షన్, మ్యూజిక్, ఎడిటింగ్ ఇలా అన్ని నెగెటివ్ పాయింట్స్ కనబడటం, కార్తీ నటన బావున్నప్పటికీ.. పైన చెప్పినవన్నీ మైనస్ లుగా ఉండడంతో సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చింది. ఇక రకుల్ గ్లామరస్ గా ఉన్నప్పటికీ ఆమె పాత్రకి ప్రాధాన్యత లేకపోవడం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ లాంటి నటులు ఆ సినిమా చేయడానికీ ఎందుకు ఒప్పుకున్నారో సినిమా చివరి వరకు అర్ధమవని విషయం. అంత పెద్ద ఆర్టిస్టులకు దర్శకుడు అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అలాగే హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా బావుండదు. అసలు కార్తీ ఎప్పుడు వైవిద్యం ఉన్న పాత్రలకే ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. కానీ ఈ దేవ్ కథని ఒప్పుకుని కార్తీ కెరీర్ లోనే పెద్ద తప్పు చేసాడనిపిస్తుంది. అందుకే దేవ్ చూసిన ప్రేక్షకుడు బాబోయ్ దేవ్ అంటున్నాడు.