Advertisementt

RRR: ఒక Rకు పేరు వచ్చేసింది..!

Fri 15th Feb 2019 05:17 PM
ram charan,ramaraju role,rrr movie,rajamouli,ntr  RRR: ఒక Rకు పేరు వచ్చేసింది..!
RRR Movie: One Name Revealed RRR: ఒక Rకు పేరు వచ్చేసింది..!
Advertisement
Ads by CJ

రాజమౌళి అలియాస్‌ జక్కన్న అంటే ఇప్పుడు దేశవిదేశాలలో, ఇండియాలోని అన్ని వుడ్‌లలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక ఈయన మొదటి నుంచి సోషల్‌మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండేవాడు. కానీ కొన్ని చిత్రాల విషయంలో తన సన్నిహితుల యావరేజ్‌ చిత్రాలకు కూడా మంచి రివ్యూలు ఇవ్వడం వల్ల విమర్శలు వచ్చాయి. నిజానికి రాజమౌళి ఇచ్చే రివ్యూల కోసం జనాలు ఎగబడి ఎదురుచూసే పరిస్థితి ఉండేది. కానీ ఫలానా చిత్రానికి రివ్యూ ఇచ్చాడు... మా చిత్రానికి ఎందుకు ఇవ్వలేదు.. ఇలాంటి తలనొప్పులు ఎదురవుతున్నాయి. అందుకే ఆయన ఈమద్య ట్విట్టర్‌ నుంచి వైదొలిగాడని తెలుస్తోంది. ఆయన చివరిగా ఇచ్చిన ట్వీట్‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నా ఓటు వేశాను అని చెప్పడం మాత్రమే. 

ఇక విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో తీస్తున్న అసలుసిసలు మల్టీస్టారర్‌ గురించి చిన్న వార్త వచ్చినా వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ఆయన రామ్‌చరణ్‌పై ఉండే సీన్స్‌ని చిత్రీకరిస్తున్నాడు. ఇదే సమయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌కి కాస్త గ్యాప్‌ రావడంతో ఈ చిత్రం కాస్టూమ్స్‌తో పాటు సినిమాలోని తన పాత్రలకు అవసరమైన కొన్ని కసరత్తులను ప్రాక్టీస్‌ చేసేందుకు జూనియర్‌ దుబాయ్‌ వెళ్లాడు. ఇటీవల ఈ చిత్రంలోని బ్రిటిష్‌ పోలీస్‌స్టేషన్‌ సెట్‌ ఒకటి లీక్‌ అయింది. దానితోపాటు ఈ మూవీలో రామ్‌చరణ్‌ పాత్ర బ్రిటిష్‌ కాలంలో పోలీస్‌గా ఉంటూనే అవకాశం కోసం ఎదురుచూస్తే ఆంగ్లేయులను దెబ్బతీసే విధంగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. 

ఇందులో రామ్‌చరణ్‌ పాత్ర పేరు ‘రామరాజు’ అనే ప్రచారం జరుగుతోంది. ‘అల్లూరి సీతారామరాజు’లోని రామరాజు దేశభక్తిని ఇందులో చూపిస్తున్నారట. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ అంటే మొదట అందరు రామ్‌చరణ్‌, రామారావు, రాజమౌళి అని మాత్రమే అనుకున్నారు. కానీ ఇదే ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సెంటిమెంట్‌ని సినిమాలోని హీరోల పాత్రల పేర్లకు కూడా సెట్టయ్యేలా రాజమౌళి దీనిని ఎంచుకున్నాడట. ఒక ‘ఆర్‌’గా రామ్‌చరణ్‌ ‘రామరాజు’.. మరి ఎన్టీఆర్‌ పాత్ర పేరు కూడా మరో ఆర్‌తో ఉండటం ఖాయమని తెలుస్తోంది. మూడో ఆర్‌ విషయంలో తాజాగా క్లారిటీ వచ్చింది. ఇందులో అజయ్‌దేవగణ్‌ విలన్‌గా నటిస్తాడని ప్రచారం జరిగింది. 

కానీ ఆయన భాష సమస్య వల్ల నటించలేనని చెప్పాడని, దాంతో చిత్రంలోని అతి ముఖ్యమైన కథను మలుపు తిప్పే ఓ అతిథి పాత్రను అజయ్‌ చేయనున్నాడని తెలుస్తోంది. మూడో ఆర్‌ ఈయన పేరుతోనే ఉంటుందని సమాచారం. మొత్తానికి ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. 

కేవలం 10, 15 శాతం షూటింగ్‌కే ఇంతగా ప్రచారం జరుగుతుంటే సినిమా విడుదలయ్యే సమయానికి మరెలా ఉంటుందో? ఈ చిత్రాన్ని డిసెంబర్‌ కల్లా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్‌కి సాంకేతిక హంగులు పూర్తి చేసి విడుదల చేయనున్నారు. ఈ విధంగా చూసుకుంటే రామ్‌చరణ్‌కి ఈ ఏడాది ‘వినయ విధేయ రామ’ వచ్చే ఏడాది ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లు అవుతాయి. కానీ ఎన్టీఆర్‌కి మాత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’ తర్వాత ఈ ఏడాది మాత్రం గ్యాప్‌ ఖాయమనే చెప్పాలి.

RRR Movie: One Name Revealed:

Ram Charan Plays RamaRaju Role in RRR Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ