టాలీవుడ్‌లో వచ్చిన నేటితరం క్లాసిక్ మూవీగా, బోల్డ్ చిత్రంగా ‘అర్జున్‌రెడ్డి’ని చెప్పవచ్చు. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే నటించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. దాంతో ఆటోమేటిగ్గా ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో రీమేక్ చేయడానికి సిద్దమైపోయారు. నిజానికి అన్ని చిత్రాలు అని చెప్పలేం గానీ ఇలాంటి అరుదైన చిత్రాలలో ఒరిజినల్ దర్శకుడి మనసులోని కథకి సంబంధించిన ఆత్మని పట్టుకోవడం మామూలు విషయం కాదు. అందుకే ఇలాంటి క్లాసిక్ చిత్రాలు రీమేక్ చేసేటప్పుడు పరభాషలో కూడా ఒరిజినల్ డైరెక్టర్‌నే ఎంచుకోవడం మంచిది. ఉదాహరణకు కన్నడలో సూపర్‌హిట్ అయిన ‘యూటర్న్’ రీమేక్‌కి సమంత అండ్ టీం అదే దర్శకుడిని ఎంచుకున్నారు. కమర్షియల్ విజయం పక్కనపెడతే ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తమిళ ‘96’ రీమేక్‌కి కూడా ఒరిజినల్ వెర్షన్ దర్శకుడినే దిల్‌రాజు ఎంచుకున్నాడు. అదే ‘కిర్రాక్‌పార్టీ’ వంటి వాటిని ఇతర దర్శకులతో తీస్తే అవి ప్రశంసలు గానీ, కలెక్షన్లు గానీ రెండు సాధించలేక రెంటికి చెడ్డ రేవడి అయింది.
ఇక విషయానికి వస్తే ‘అర్జున్‌రెడ్డి’ చిత్రానికి బాలీవుడ్ రీమేక్‌ని ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగానే దర్శకత్వం వహిస్తున్నాడు. షాహిద్ కపూర్ వంటి హీరోని పెట్టుకున్నాడు. కానీ కోలీవుడ్‌లో మాత్రం చియాన్ విక్రమ్ కుమారుడు దృవ్‌ని పరిచయం చేస్తూ దేశం గర్వించదగ్గ దర్శకుడు బాలాని పెట్టుకున్నారు. కానీ షూటింగ్ పూర్తయిన తర్వాత చిత్రం బాగా లేదని గమనించి, మొత్తం చిత్రాన్ని మరలా తీయాలని, ఇప్పుడు తీసిన ‘వర్మ’ని చిత్రాన్ని చెత్తలో పడేయాలని నిర్ణయించుకున్నారు.
ఇక మరో దర్శకుడి కోసం అన్వేషణ సాగుతోంది. మొదటగా ఈ చిత్రానికి ప్రేమకథ, బోల్డ్ చిత్రాలను కూడా తీయగల గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా తెలుగు ‘అర్జున్‌రెడ్డి’కి అసోసియేట్ దర్శకుడు గిరీశయ్యని కోలీవుడ్ రీమేక్‌కి పెట్టుకుంటున్నారని అంటున్నారు. ఆ చిత్రానికి పనిచేసి ఉండటంతో ఈ చిత్రంలోని ఆత్మ ఈయనకైతేనే బాగా తెలిసి ఉంటుందనే నమ్మకంతోనే గిరీశయ్యకి చాన్స్ ఇస్తున్నారని సమాచారం. అసలు తొందరపడకుండా సందీప్‌రెడ్డి బాలీవుడ్ రీమేక్ పూర్తి చేసిన తర్వాత ఆయన చేతిలో ఈ ‘వర్మ’ బాధ్యతలు కూడా అప్పగించి ఉంటే బాగుండేది...!