ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజున్న హీరోలలో విజయ్ దేవరకొండ ముందు వరసలో ఉంటాడు. కెరీర్‌లో చిన్న చిన్న పాత్రల ద్వారా తెలుగు తెరకు పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే హీరోగా సూపర్ హిట్స్ అందుకున్న విజయ్ దేవరకొండతో సినిమాలు చేసేందుకు చాలామంది దర్శకనిర్మాతలు క్యూలో ఉన్నారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం కథని నమ్మి సినిమాలు చేస్తున్నాడు. అందుకే విజయ్‌కి త్వరగా విజయాలు వరిస్తున్నాయి అంటారు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల్తో స్టార్ హీరో అవతారమెత్తిన విజయ్ దేవరకొండ తాజాగా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న భరత్ కమ్మ దర్శకత్వంలో రష్మిక మందన్నతో కలిసి డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు.
షూటింగ్ ఏకధాటిగా జరుపుకుంటున్న డియర్ కామ్రేడ్ చిత్రకరణ చివరిదశకు చేరుకుంది. కాకినాడలోని కాలేజ్ లో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల మీద సినిమాలోని మేజర్ సన్నివేశాలను ఎక్కువగా చిత్రీకరణ జరిపారట. అయితే కాకినాడ షూటింగ్ పూర్తికాగానే విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ అవుట్ ఫుట్ చూసి నిరాశకు లోనయ్యాడట. సినిమాలో ఎమోషనల్ కంటెంట్ తగ్గిందని అందుకే కొన్ని సీన్స్‌ని రీ షూట్స్ చెయ్యమని దర్శకనిర్మాతలకు చెప్పాడట విజయ్. సినిమాలో కావాల్సినంత ఎమోషన్ ఉంటేనే.. ప్రేక్షకులు త్వరగా కథకు కనెక్ట్ అవుతారని విజయ్ చెప్పినదానికి దర్శకనిర్మాతలు మారు మాట్లాడకుండా రీ షూట్ చేయడానికి రెడీ అయ్యారట.
మరి సూపర్ హిట్ హీరో ఏదైనా చెబితే చెయ్యకుండా ఉంటారా. ఇప్పుడు డియర్ కామ్రేడ్ దర్శకనిర్మాతల పరిస్థితి అదే. అందులోను విజయ్ హిట్ చిత్రాల్లో నటించి ఉన్నాడు. అందుకే బోలెడంత క్రేజ్ ఉంటుంది. మరోపక్క తన హిట్స్ పరంపరని మెయింటైన్ చెయ్యడానికి విజయ్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. మరి ఇలాంటి చిన్న చిన్న జాగత్తలు తీసుకొవడంలో తప్పులేదులే.