అదేమి చిత్రమో ‘వర్మ’ అనే పేరులోనే ఏదో మహిమ దాగుందా? అనిపిస్తోంది. రాంగోపాల్‌వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిత్యం వార్తల్లో ఉంటాడు. ఇక ‘వర్మ’ పేరుతో కోలీవుడ్‌లో చిత్రం తీస్తే దానిని మరలా రీషూట్ చేయాలని అనుకోవడం పెద్ద చర్చనీయాంశం అయింది. ఇక వర్మ మద్దతుదారులు, ఆయన వ్యతిరేకులు కూడా సంచలనాత్మక వ్యవహారాల్లో ముందుంటారు. శ్రీరెడ్డి నుంచి కత్తిమహేష్ వరకు ఇదే తంతు. ఇక వర్మ మెగా హీరోలపై, మెగాఫ్యాన్స్‌పై సెటైర్లు వేయడం, దానికి బదులుగా నాగబాబు ‘వర్మ’ని ‘అకుపక్షి’ అని తిట్టడం నుంచే మెగాబ్రదర్ మనసు కూడా మారింది. ప్రస్తుతం ఆయన మరో వర్మలా తయారయ్యాడు. బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు? అని అనడం, వరుసగా ఐదారు వీడియోలతో బాలయ్యని ఎండగట్టడం, ‘ఎర్రోడి వీరగాథ’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో నటించడం.. ఇలా ఈ తంతు సాగుతోంది.
ఇక ఈయన నారాలోకేష్ బంధుప్రీతి, కులగజ్జి ఎక్కువగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది టిడిపినే అని తప్పుగా మాట్లాడిన మాటలపై ఇంత నిజాయితీగా మాట్లాడే నాయకుడు మరొకరు లేరు అని వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. ఇటీవలే ‘ఆరోగ్యం బాగా ఉండాలంటే ‘సైకిల్’ తొక్కాలి. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే సైకిల్‌నే ‘తొక్కాలి’ అని కామెంట్ చేశాడు. ఇవ్వన్నీ బాగానే అర్ధమవుతున్నాయి గానీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల ఉద్దేశ్యం మాత్రం అర్ధం కావడం లేదు.
ఆయన మాట్లాడుతూ... టాలీవుడ్‌లో అక్కినేని, నందమూరి, మెగా, సురేష్ ఫ్యామిలీలు ఒకవైపు దిల్‌రాజు, అల్లుఅరవింద్, సురేష్‌బాబు... వీరిని మించిన పెద్ద మాఫియా ఎవరుంటారు? మేమే పెద్దమాఫియా. అల్లుఅరవింద్ దావూద్ ఇబ్రహీం అయితే మా అన్నయ్య చోటా రాజన్ అంటూ ఎవేవో వ్యాఖ్యలు చేశాడు. ఇక చిన్న చిత్రాలకు థియేటర్లు లభించడం లేదన్న వాదనపై ఈయన దిల్‌రాజు చెప్పిన వివరణనే తన అభిప్రాయంగా చెప్పుకొచ్చాడు.
మరోవైపు తమ కుమార్తె నిహారిక వివాహం ఈ ఏడాదే ఉంటుందని, తమ కులం వారైనా ఫర్వాలేదు.. ఏ కులం, మతం వారైనా మంచి గుణవంతుడు కనిపిస్తే వివాహం చేస్తామన్నాడు. తనపై వచ్చిన విమర్శలను పట్టించుకోనని కొన్ని రోజుల ముందు గంభీరమైన స్టేట్‌మెంట్ ఇచ్చిన మెగాబ్రదర్ ఈమధ్య పవన్‌కి విరాళం ఇచ్చిన విషయంలో వరుణ్‌తేజ్‌పై వస్తున్న సిల్లీ విమర్శలకు అదేగా పని పెట్టుకుని వివరణ ఇవ్వడం విశేషం.