సూపర్‌స్టార్ మహేష్ బాబు తన 25 వ చిత్రం మహర్షి ఏప్రిల్ 25 న విడుదలకు సిద్ధం అవుతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, పీవీపీ, అశ్వినిదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ వాస్తవంగా సుకుమార్ తో చేయాలి. కానీ సుకుమార్ చెప్పిన కథలు మహేష్ కి ఏమి నచ్చడం లేదు.
దాంతో వేరే డైరెక్టర్స్ తో వెళ్ళిపోదాం అని చూస్తున్నాడు. లిస్ట్ లో అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగా పేర్లు ఉన్నాయి. అయితే వీరిలో ఎవరిని ఫైనల్ చేస్తాడు అనేది సస్పెన్. తాజా సమాచారం ప్రకారం పెళ్లి చూపులు ఫేమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, మహేష్ కు పిచ్చెక్కించే స్టోరీ ఒకటి నేరేట్ చేశాడట.
కథ విన్న మహేష్ ఫిదా అయిపోయినట్టు టాక్. అయితే తరుణ్ ఇది వెబ్ సిరీస్ కోసం రాసుకున్న కథ అని దాన్ని సినిమాగా ఎందుకు మలచకూడదు అని మహేష్ బాబు అడిగాడని చెబుతున్నారు. మహేష్ బాబు ప్రొడక్షన్ లో ‘చార్లీ’ పేరుతో ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు. మరి తరుణ్ కథను ఎలాగా సినిమాగా మలుచుతారు అనేది సస్పెన్స్ గా మారింది ఫ్యాన్స్ లో. అసలే ఈ డైరెక్టర్ కి ట్రాక్ రికార్డు అంతగా ఏమి లేదు. అతను తీసిన ‘పెళ్లి చూపులు’ తప్ప తరువాత తీసిన ‘ఈ నగరానికి ఏమైంది?’ మూవీ అడ్డం తిరిగింది. అంతకుముందు అఖిల్ కోసం తరుణ్ ఓ మూవీ ప్లాన్ చేసి అది సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది. మరి ఇటువంటి మార్క్ ఉన్న తరుణ్ తో మహేష్ సినిమా ఏంటి అంటున్నారు. ఒకవేళ ఈ కాంబినేషన్ ఓకే అయితే మహేష్ నెక్స్ట్ చేసే సినిమా ఇదే అవ్వొచ్చు.