Advertisementt

వైష్ణ‌వ్‌ తేజ్ నిజంగా లక్కీ ఫెలో..!

Thu 14th Feb 2019 12:32 PM
vijay sethupathi,vaishnav tej,new film,villain role,chiranjeevi  వైష్ణ‌వ్‌ తేజ్ నిజంగా లక్కీ ఫెలో..!
Vijay Sethupathi In Vaishnav Tej Film వైష్ణ‌వ్‌ తేజ్ నిజంగా లక్కీ ఫెలో..!
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలీ నుండి రీసెంట్ గా మరో హీరో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్‌ తేజ్ టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. కొత్త డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రి మూవీస్ తో పాటు సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. అందుకే డైరెక్టర్ చాలామంది పేర్లు అనుకున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో విలన్ పాత్ర చేసేందుకు తమిళ నటుడు విజయ్ సేతుపతి ఓకే చెప్పినట్టు టాక్.

చిరంజీవి ఒప్పించడంతో విజయ్ ఈ సినిమా చేస్తునట్టు టాక్. ఇది వాస్తవిక ప్రేమకథ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం బెస్తవాళ్ల బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించనున్నారు. అయితే హీరోయిన్ ఎవరు అనేది తెలియాల్సిఉంది.

Vijay Sethupathi In Vaishnav Tej Film:

Chiru Requests, Vijay Accepts  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ