Advertisementt

‘ప్రేమసాగరం, ప్రేమదేశం’ రేంజ్‌లో ఉంటుంది

Wed 13th Feb 2019 12:01 PM
lovers day,ready to release,priya prakash varrier,lovers day telugu movie  ‘ప్రేమసాగరం, ప్రేమదేశం’ రేంజ్‌లో ఉంటుంది
Lovers Day Movie Release press Meet details ‘ప్రేమసాగరం, ప్రేమదేశం’ రేంజ్‌లో ఉంటుంది
Advertisement

ఒకే ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రియా ప్రకాశ్ వారియర్, రావూఫ్ రోషన్ జంటగా నటించిన ‘లవర్స్ డే’ (మలయాళంలో ఒరు ఆధార్ లవ్) చిత్రం రిలీజ్‌కు ముస్తాబైంది. తెలుగు, మలయాళంతోపాటు కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఏక కాలంలో ప్రేమికుల రోజున అంటే ఫిబ్రవరి 14న విడుదల కానున్నది. క్రేజీ డైరెక్టర్ ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి సుఖీభ‌వ సినిమాస్ బ్యానర్‌పై అందిస్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాత ఏ గురురాజ్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను మూడే మూడు చిత్రాలు ఆకట్టుకొన్నాయి. ధనుష్ నటించిన ‘త్రీ’ చిత్రంలో కోలవెరి పాట, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే అంశం బాహుబలి చిత్రంపై భారీ క్రేజ్‌ను ఏర్పాటు చేసింది. అదే కోవలో ఒరు ఆధార్ లవ్ సినిమా టీజర్‌‌ కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. అందులో కన్నుగీటిన ప్రియా ప్రకాశ్ వారియర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమాను లవర్స్ డే పేరుతో ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నాం. ‘ఒరు ఆధార్ లవ్’ టీజర్ ద్వారా ఆకట్టుకొన్న ప్రియా వారియర్‌కు ఆరేళ్ల వయసు నుంచి అరవై ఏళ్లకు పైబడిన వారి నుంచి కూడా ఆదరణ లభించింది. ప్రియా వారియర్ క్రేజ్ వయసుతో నిమిత్తం లేకుండా గ్రామాలకు చేరింది. ఈ సినిమాపై క్రేజ్ పెరగడంతో తెలుగు హక్కులను దక్కించుకొనేందుకు ఇండస్ట్రీ నుంచి గట్టిపోటి ఎదురైంది. దాంతో భారీ మొత్తాన్ని వెచ్చించి లవర్స్ డే హక్కులను సొంతం చేసుకొన్నాం. లవర్స్ డే సినిమా హక్కులను సొంతం చేసుకోవడానికి సహకరించిన సీతారామరాజు, సురేష్ వర్మలకు థ్యాంక్స్. గతంలో కుష్బూ, నదియా లాంటి వారిని సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు ఓమర్ లులు ‘లవర్స్ డే’  రూపొందించారు. కొత్తవారితో అద్భుతమైన కంటెంట్‌తో తీసిన విధానం, కథను తెరకెక్కించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే విధంగా ఉంది. లవర్స్ డే సినిమా చూసినప్పుడు మధ్యతరగతి వయసు వాళ్లు చూసినప్పుడు వారు తప్పకుండా తమ యూత్‌ రోజులను గుర్తు చేసుకొంటారు. స్నేహం, ప్రేమ విలువను అద్భుతంగా చెప్పారు. ప్రేక్షకుడు పెట్టిన ప్రతీ పైసా వసూల్ అవుతుంది. ‘లవర్స్ డే’ చిత్రంలో తొమ్మిది పాటలు ఉంటాయి. మేము విడుదల చేసిన ఎనిమిది పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తొమ్మిదో పాట థియేటర్‌లో ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. ఆ పాటకు ప్రేక్షకులు లేచి సెల్యూట్ చేయడం ఖాయం. గతంలో వచ్చిన ప్రేమసాగరం, ప్రేమదేశం లాంటి సినిమాల రేంజ్‌లో ఉంటుంది. ఇప్పటివరకు నేను సొంతంగానే సినిమాలు చేశాను. తొలిసారి పంపిణీదారుడు, నిర్మాత వినోద్‌రెడ్డితో కలిసి నేను ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. వినోద్ రెడ్డి నిర్మాతగానే కాదు, మంచి స్నేహితుడిగా నాకు సహకరించారు..’’ అన్నారు. 

నిర్మాత వినోద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘అద్భుతమైన సినిమాను అందించిన ఓరు ఆధార్ లవ్ దర్శకుడు, నిర్మాతకు ధన్యవాదాలు. మా ఆహ్వానాన్ని మన్నించి ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా థ్యాంక్స్  చెప్పుకోవాలి. ఆయన రావడం వల్ల మా సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2 వేల థియేటర్లకుపైగా రిలీజ్ అవుతున్నది. తెలుగులో సుమారు 600 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. లవర్స్ డే చిత్రం చూసిన తర్వాత అద్భుతమైన ఫీలింగ్‌తో ప్రేక్షకుడు బయటకు వస్తాడు’’ అని అన్నారు. 

న‌టీన‌టులు: 

ప్రియా వారియర్, నూరిన్ షెరిఫ్‌, రోష‌న్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, మైఖేల్ యాన్ డేనియ‌ల్‌, దిల్‌రూపా, హ‌రీష్ పెరుమ‌న్న‌, అనీష్ జి మీన‌న్‌, షాన్ సాయి, అర్జున్ హ‌రికుమార్‌, అతుల్ గోపాల్‌, రోష్న అన్‌రాయ్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు : 

కెమెరా: శీను సిద్ధార్థ్‌ 

ఎడిటింగ్‌: అచ్చు విజ‌య‌న్‌ 

సంగీతం: షాన్ రెహ‌మాన్‌ 

స్క్రీన్‌ప్లే: సారంగ్ జ‌య‌ప్ర‌కాష్‌, లిజో ప‌నాడా 

క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఒమ‌ర్ లులు 

నిర్మాత‌లు: ఎ. గురురాజ్‌, సి.హెచ్‌. వినోద్‌రెడ్డి  

Lovers Day Movie Release press Meet details:

Lovers Day Movie Ready to Release

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement