Advertisementt

బోయపాటి అస్సలు మారలేదుగా..?

Tue 12th Feb 2019 09:33 PM
balakrishna,boyapati srinu,vinaya vidheya rama,vvr,no change,director boyapati  బోయపాటి అస్సలు మారలేదుగా..?
No Change in Director Boyapati Srinu బోయపాటి అస్సలు మారలేదుగా..?
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ ‘విన‌య విధేయ రామ‌’ విషయంలో డైరెక్టర్ బోయపాటి కావాల్సిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టాడని అందుకే ప్రొడ్యూసర్‌కి బోయపాటికి మధ్య చిన్నచిన్న మనస్పర్థలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఇది నిజమే ఎందుకంటే సినిమా చూస్తే మనకే అర్ధం అవుతుంది. సరే ఇంత ఖర్చు పెట్టాడు సినిమా రిజల్ట్ ఏమైంది డిజాస్టర్ అయింది.

రిజల్ట్ చూసిన తర్వాతైనా ఏమన్నా మారతాడా అంటే అదీ లేదు. ఇప్పుడు అతను తీయబోయే బాలకృష్ణ సినిమా కోసం ఏకంగా 70 కోట్ల బ‌డ్జెట్ కావాల‌ని అడిగాడ‌ట‌. వీరి కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమా కోసం బోయపాటి 70 కోట్లు అడిగాడట. ఒకరకంగా బాలయ్య పై ఇది రిస్కు వ్య‌వ‌హార‌మే. 

ఇప్పటివరకు బాలయ్య సినిమాలేవీ 70 కోట్లు చేయలేదు. రీసెంట్‌గా వచ్చిన కథానాయకుడు కూడా అంత చేయలేదు. కేవలం 20 కోట్లు వద్ద ఆగిపోయింది. అయితే బోయపాటి - బాలయ్య కాంబినేషన్ వేరు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బాస్టరే. అందుకే బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు బోయపాటి. అయితే ఈసినిమాకి బాలయ్యే నిర్మాత. అయితే బాలయ్య ఇంతవరకు బడ్జెట్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ తీసుకున్నా తగ్గించే అవకాశాలు లేకపోలేదు.

No Change in Director Boyapati Srinu:

Boyapati Srinu wants 70 crores Budget for Balayya Movie 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ