Advertisementt

చిరు, రజనీలపై నెటిజన్ల సెటైర్లు..!

Tue 12th Feb 2019 08:26 PM
rajinikanth,chiranjeevi,daughters marriage,nezizens,second marriage,satires  చిరు, రజనీలపై నెటిజన్ల సెటైర్లు..!
Netizens Comments on Chiranjeevi and Rajinikanth చిరు, రజనీలపై నెటిజన్ల సెటైర్లు..!
Advertisement
Ads by CJ

పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అనేది మన పెద్దలు ఎప్పుడో చెప్పిన మాట.. సాధారణంగా విదేశాలలో మామూలే గానీ నేడు మన దేశంలో కూడా అమ్మాయిలు రెండో వివాహాలు చేసుకోవడం కామన్‌ అయింది. దీనిని మనం తప్పుపట్టకూడదు. విభేదాల వల్లనో, లేక భర్తలు మరణించడం వంటి కారణాల వల్ల అమ్మాయిలు జీవితాంతం ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. వారు కూడా తమకిష్టమైన వారితో అనుబంధం పెంచుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ అదే సెలబ్రిటీల విషయానికి వస్తే మాత్రం అది పెద్ద పబ్లిసిటీ అవుతుంది. అందుకే ‘కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు.. మనిషి కుక్కని కరిస్తేనే అది సంచలన వార్త అవుతుంది’ అనే నానుడి వచ్చింది. ఇంతకీ ఈ విషయం ఎందుకంటే రజనీకాంత్‌ రెండో కూతురు సౌందర్య రెండో వివాహాన్ని ప్రస్తుతం నెటిజన్లు చిరంజీవి ఫ్యామిలీతో పోలుస్తున్నారు. 

చిరంజీవి మంచి పీక్స్‌లో ఉన్న సమయంలో, అందునా రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చే టైంలో ఆయన రెండో కూతురు ఇంట్లోని వారిని ఎదిరించి ఏకంగా ఓ చానెల్‌ సపోర్ట్‌తో వివాహం చేసుకుంది. దానిని పలువురు చిరంజీవిని విమర్శించడానికి ఆయుధంగా ఉపయోగించుకున్నారు. సొంత పిల్లలనే కంట్రోల్‌ చేయలేనివాడు, రాష్ట్ర ప్రజలను ఏం ఉద్దరిస్తాడు? అని నానా కామెంట్స్‌ వచ్చాయి. చివరకు శ్రీజ మొదటి భర్తని వదిలేసి ఒకే ఒక సంతానంతో ఇంటికి వస్తే తండ్రిగా చిరంజీవి ఆమెని చేరదీశాడు. మరలా ఆమెకి రెండో వివాహం చేశాడు. ఇక రజనీకాంత్‌ రెండో కూతురు సౌందర్యది కూడా అదే స్టోరీ. 

మొదటి వివాహం పెటాకులు కావడంతో తన ఇంట్లోనే ఉంచుకుని ఆమె ఇష్టాన్ని కాదనలేక డైరెక్టర్‌గా చేసిన ఘనత రజనీది. తాజాగా ఆయన సౌందర్య ప్రేమించిన బడా పారిశ్రామికవేత్త కుమారుడు, సినీ నటుడు విశాఖన్‌తో వివాహం జరిపించాడు. తమిళ, తెలుగు ఇండస్ట్రీలకి చెందిన తిరుగులేని సూపర్‌స్టార్స్‌ ఇద్దరికి పిల్లల విషయంలో ఇలా పోలిక కలవడం కాకతాళీయమే అయినా దీనిపై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. 

ఇక సౌందర్య పెళ్లి సంగీత్‌ కార్యక్రమంలో రజనీ ‘ముత్తు, బాషా’ వంటి చిత్రాలలోని పాటలకు తన కుటుంబ సభ్యులతో కలిసి వేసిన చిందుల వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 68 ఏళ్ల వయసులో ఆరోగ్యం కూడా సరిగా లేని రజనీ ఇలా అభిమానులను మురిపించి ‘కబాలి డా’ అనిపించాడు. ఇక చిరు కూతురి వివాహంలో కూడా చిరు, బాలయ్య వంటి వారు చిందులేసిన సంగతి తెలిసిందే.

Netizens Comments on Chiranjeevi and Rajinikanth :

Daughters Marriage: Rajinikanth follows Chiranjeevi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ