ఇటీవల ఓ వేదికపై ఊహించని చిత్రం జరిగింది. ఎవరూ ఊహించని జంట కలిసి నటించిన తమిళ సినిమా `96`. ఫీల్ గుడ్ చిత్రంగా నిలిచింది. ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసిన ఈ సినిమాపై ఇతర భాషల నిర్మాతలు సైతం మనసుపడ్డారు. సినిమా విడుదలకు ముందే ఆ చిత్ర రీమేక్ హక్కుల్ని నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకుంటే ఇతర భాషల వాళ్లు భారీ మొత్తం చెల్లించి రీమేక్ హక్కుల్నిదక్కించుకున్నారు. ఈ చిత్రం ఇటీవలే వంద రోజులు పూర్తి చేసుకుంది. దానికి సంబంధించిన వేడుక ఇటీవలే చెన్నైలో జరిగింది. ఆ వేడుక జరుగుతున్న వేదికపై ఊహించని సంఘటన చోటుచేసుకుంది. తమిళంలో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకుంటూ వరుస విజయాన్ని సొంతం చేసుకుంటున్న హీరో విజయ్ సేతుపతి, క్రేజీ హీరోయిన్ త్రిష కలిసి ఈ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది విడుదలై ప్రేమకథా చిత్రాల్లోనే కొత్త ఒరవడిని సృష్టించిన సినిమాగా నిలిచింది. 90ల ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటించినా ఒక్క సన్నివేశంలోనూ త్రిషని తాకడు. కానీ ఈ చిత్ర శతదినోత్సవ సంబరం జరుపుకుంటున్న వేళ వేదికపైనే త్రిషను ఆత్మీయంగా హగ్ చేసుకోవడం లవ్‌లీగా అనిపించింది. ఊహించని ఈ హగ్‌కు త్రిష సంబరపడిపోయిందట. ఇద్దరు ఒక్కసారి సినిమాలోని తాము పోషించిన పాత్రల్ని గుర్తుచేసుకున్నారట. వేదికపై ఈ చిలిపి సన్నివేశం ఆవిషృతం కావడానికి సీత మాజీ భర్త పార్తీబన్ సలహానే కారణమని తెలిసింది.