సంక్రాంతి పండుగకు ఎంత కాదనుకున్నా మూడు నాలుగు చిత్రాలకు స్కోప్ ఉంటుంది. దాంతో ప్రతి ఏడాది ఇదే సీజన్ కోసం బడా బడా స్టార్స్ బెర్త్‌లు రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. పెద్ద చిత్రాలు విడుదలయ్యే ఈ సీజన్‌లో చిన్న చిత్రాలను పోటీగా దింపడం చాలా రిస్క్‌గా అందరు నిర్మాతలు భావిస్తూ ఉంటారు. కానీ కంటెంట్ ఉన్న చిత్రాలకు ఈ పోటీ పెద్ద లెక్కలోనిది కాదు. అంతేకాదు.. విడుదలైన బడా స్టార్ల చిత్రాల కంటే ఫలానా చిత్రం బాగుందని తెలిస్తే ఇక బాక్సాఫీస్ వద్ద తిరుగే ఉండదు.
ఈ విషయం ఇటీవల కాలంలో కూడా ‘సోగ్గాడే చిన్ననాయనా, శతమానం భవతి, ఎఫ్2’ చిత్రాలతో నిరూపితం అయింది. ఇక వచ్చే ఏడాదికి స్టార్స్ తమ చిత్రాలను రిలీజ్ చేయాలని భావిస్తున్న తరుణంలో పొంగల్ రేసులో సైలెంట్ కిల్లర్‌గా తమ చిత్రాన్ని తేవాలని దిల్‌రాజు-నానిలు డిసైడ్ అయ్యారట. ఈ ఏడాది దిల్‌రాజు నిర్మిస్తున్న ‘మహర్షి, 96’ రీమేక్‌లు విడుదల కానున్నాయి. మరోవైపు నాని ఈ ఏడాది ‘జెర్సీ’తో పాటు విక్రమ్ కె.కుమార్‌ల చిత్రాలను ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈయన ‘డి ఫర్ దోపిడి, అ’ ల తర్వాత ఎంతో తెలివిగా దిల్‌రాజుతో టై అప్ అయి ఓ చిత్రం, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఓ చిత్రంలో తానే నటిస్తూ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నాడు.
అందులో తొలి ప్రయత్నంగా తనకి ‘అష్టాచెమ్మా’తో బ్రేక్ ఇచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో దిల్‌రాజు- నానిల చిత్రం ప్రారంభం కానుంది. ఇక నానితో ‘అష్టాచెమ్మా’ మామ్రే కాదు.. ‘జెంటిల్‌మేన్’ వంటి హిట్‌ని అందించిన ఇంద్రగంటితో మొదట నాని-దుల్కర్‌సల్మాన్‌ల కాంబినేషన్‌లో మల్టీస్టారర్ రూపొందనుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంలో దిల్‌రాజు, నానిలు మనసు మార్చుకుని సోలోగా నానితోనే చిత్రం తీయనున్నారని తెలుస్తోంది. మే లేదా జూన్‌లో ఈ చిత్రాన్ని మొదలుపెట్టి వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో దీనిని సైలెంట్ కిల్లర్‌గా దింపాలనే ఆలోచనలో నాని-దిల్‌రాజులు ఉన్నారని సమాచారం.