మణికర్ణిక విషయంలో దర్శకుడు క్రిష్ అన్నిటిని కెలికేసి కూర్చున్నాడు. మణికర్ణికలో కంగనా దర్శకురాలిగా ఎలా పేరు వేసుకుంటుందని.... కంగానాని రెచ్చగొట్టి వదిలేశాడు. దర్శకత్వం విషయంలో వచ్చిన విభేదాలు మణికర్ణిక విడుదల తర్వాత తారాస్థాయికి చేరాయి. మణికర్ణికని వదిలేసి ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు మీద దృష్టి పెట్టిన క్రిష్ తన ప్రయత్నలోపం లేకుండా బాలకృష్ణతో కథానాయకుడు సినిమా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. క్రిష్ కథానాయకుడికి ప్రశంసలు అందినా.. కలెక్షన్ రాలేదు. ఇక కథానాయకుడు హిట్ టాక్ అందుకున్న క్రిష్ తాను వదిలేసిన వచ్చిన మణికర్ణిక మీద పడ్డాడు. దర్శకత్వం నేను ఎక్కువ శాతం చేస్తే.. కంగనా తన పేరు వేసుకుంది.. కంగనాకు సిగ్గులేదని మీడియా ముందు వాపోయాడు. ఇక క్రిష్ లైన్ లో ఉన్నప్పుడు కంగనా, క్రిష్ కి సమాధానం చెప్పలేదు. క్రిష్ మణికర్ణిక విషయమై చాలా గొడవ చేశాడు.
కానీ కంగనా కాస్త లేట్ గా స్పందించినా క్రిష్ ని మీడియా ముందు కడిగిపడేసింది. క్రిష్ కి, మణికర్ణిక సినిమాకి సంబంధం లేదంటూనే.. మణికర్ణిక సినిమా క్రిష్ వలెనే పోయిందని క్రిష్ కి పడి ఏడుస్తుంది. అలాగే బాలీవుడ్ వాళ్ళు సపోర్ట్ చెయ్యలేదని.. బాలీవుడ్ ప్రముఖులను బెదిరిస్తోంది. మీ బండారాల్ని బయటపెడతాను అంటూ బ్లాక్ మెయిల్ చేస్తుంది. అయితే మణికర్ణిక విడుదలయ్యాక నోరు విప్పి మీడియా ముందు రచ్చ చేసిన క్రిష్ ప్రస్తుతం కంగనాకు రిప్లై ఇవ్వకుండా సైలెంట్ అయ్యాడు. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం క్రిష్ సైలెంట్ వెనుక బాలకృష్ణ ఉన్నాడంటున్నారు. కథానాయకుడు హిట్ అయినప్పుడు మాట్లాడితే మాట్లాడావు.. కానీ కలెక్షన్స్ పరంగా ఘోరంగా దెబ్బతిని ఉన్నాం.. ఇప్పుడు మణికర్ణిక విషయాన్నీ వదిలిపెట్టకపోతే... మహానాయకుడు కూడా కథానాయకుడు వలె జరిగే ప్రమాదం ఉంది. ఒకవేళ మహానాయకుడు షూటింగ్ పూర్తి చేసి... విడుదల చేశాక మణికర్ణిక విషయం మాట్లాదువులే అని క్రిష్ కి, బాలయ్య చెప్పడంతోనే క్రిష్ మణికర్ణిక విషయాన్నీ పక్కన బెట్టడానికి కారణమని తెలుస్తుంది.
మరి మహానాయకుడు షూటింగ్ ప్రస్తుతం కంప్లీట్ అవగా.. రీరికార్డింగ్ పనులు చూస్తున్న క్రిష్ బాలయ్య చెప్పడం వలెనే కంగానికి కౌంటర్లు ఇవ్వడం లేదట. అలాగే మహానాయకుడు ఒక కొలిక్కి వచ్చి విడుదలై టాక్ బావుంటే.. మళ్ళీ మణికర్ణిక విషయంలో బాలీవుడ్ ప్రముఖుల వద్ద పంచాయితీ పెట్టాలని చూస్తున్నాడట. మరి మణికర్ణిక టాక్ తో సంబంధం లేకుండా కొన్ని రోజులు కలెక్షన్స్ కొల్లగొట్టినా.. ప్రస్తుతం మణికర్ణిక వలన నిర్మాతలకు నష్టాలూ వచ్చే సూచనలు కనబడుతున్నాయి. అది సహించలేకే కంగనా క్రిష్ మీద ఫైర్ అవుతుందని అంటున్నారు.