ఏపీలో తీవ్ర ఆందోళన మధ్య ప్రధానమంత్రి నరేంద్రమోడీ భారీ బహిరంగ సభ గుంటూరులో ప్రారంభమైంది. బిజెపి పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా నాటకాలాడుతోందని.. కేవలం మట్టి నీరు ఇచ్చిన ప్రధాని మోడీ పర్యటనను, ఆయన సభను, బిజెపి నేతలను ఆదుకుంటామని.. వామపక్షాలు, టిడిపి నాయకులూ ఎప్పటి నుండో చెబుతున్నారు. ఇక ఈ రోజు ప్రధాని మోడీ సభను అడ్డుకునేందుకు ఏపీ ప్రజలు, పార్టీ కార్యకర్తలు అందరూ రోడ్డు మీదకెక్కి నిరసనలు జరుపుతున్నారు. అంత నిరసనల సెగ మధ్య మోడీ విజయవాడకి ప్రత్యేక విమానంలో రావడం అక్కడ నుండి.. హెలికాఫ్టర్ లో గుంటూరు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
ఇక ప్రధాని మోడీ సభాస్థలికి చేరుకొని అక్కడ బిజెపి నేతలు పురందరేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, ఇలా అందరిని పలకరిస్తూ.. పక్కనే ఉన్న బిజెపి నేత, నటుడు కృష్ణంరాజుని ప్రధాని మోడీ ప్రేమతో కొడుతూ వేదికను అలంకరించారు. కృష్ణంరాజు నటుడిగా బీజేపీలో చేరి బిజెపి నేతగా ఉన్నారు. నరేంద్ర మోడీ సభకు కృష్ణంరాజు కూడా హాజరయ్యారు. ఇక కృష్ణంరాజుని మోడీ ప్రేమతో కొట్టడం చూసి ఆయన అభిమానులు ఆనందిస్తున్నారు.