కథానాయకుడు సినిమా కలెక్షన్స్ దెబ్బకి మహానాయకుడు సినిమా ఎప్పుడు విడుదల చెయ్యాలో కూడా తెలియని కన్ఫ్యూజన్ లో బాలయ్య అండ్ క్రిష్ టీమ్ ఉన్నారు. కథానాయకుడు సినిమా హిట్ అయినా.. కలెక్షన్స్ రాలేదు. అందుకే కథానాయకుడు తర్వాత ఒక నెలలోపలే మహానాయకుడు విడుదలని ముందు ప్రకటించినప్పటికీ.... కథానాయకుడు సినిమాకొచ్చిన కలెక్షన్స్ దెబ్బకి మహానాయకుడుకు మహా రిపేర్లు చేసుకుంటూ క్రిష్ అండ్ బాలకృష్ణలు ఉండిపోయారు. కథానాయకుడు సినిమా విడుదలకు ముందు నుండి అంటే సినిమా మొదలైనప్పటి నుండే ప్రమోషన్స్ మొదలెట్టేసిన క్రిష్ మహానాయకుడు విషయంలో మాత్రం గమ్మునుంటున్నాడు.
అయితే మహానాయకుడు సినిమాకి ఆ షూట్స్ ఈ షూట్స్ అంటూ రీషూట్స్ చేశారు. కథానాయకుడులో మిస్ అయినవి మహానాయకుడులో ఇరికించారని టాక్ ఉంది. ప్రేక్షకులు మనసుకు హత్తుకునే సన్నివేశాలు, ఎమోషన్స్, కామెడీ అన్నీ ఈ మహానాయకుడిలో ప్రేక్షకులకు చూపించబోతున్నారట. అయితే కథానాయకుడు విడుదల తర్వాత మళ్ళీ ఇంతవరకు మహానాయకుడు విషయం ఎక్కడా మాట్లాడని.. క్రిష్ అండ్ బాలకృష్ణలు మహానాయకుడ్ని ప్రేక్షకులు మెచ్చేలా, నచ్చేలా తీర్చిదిద్దే పనిలో షూటింగ్ కి విరామం ఇవ్వకుండా మహానాయకుడు రీషూట్స్ ని చిత్రీకరించారట.
తాజాగా మహానాయకుడు షూటింగ్ సారధి స్టూడియోస్ లో చేసిన సన్నివేశాలతో పూర్తయ్యిందని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని లేటెస్ట్ సమాచారం. క్రిష్ కూడా మహానాయకుడు రీరికార్డింగ్ పనుల్లో బిజీ అయ్యాడట, అందుకే మణికర్ణిక విషయం ఎత్తడం లేదంటున్నారు. ఇక రెండు మూడు రోజుల్లో మహానాయకుడు విడుదల డేట్ విషయంలోనూ బాలయ్య అండ్ క్రిష్ లు ఒక నిర్ణయానికి వచ్చి అధికారిక ప్రకటన ఇచ్చేస్తారని అంటున్నారు. అయితే మోస్ట్లీ మార్చి నాలుగు మహాశివరాత్రి కానుకగా మహానాయకుడు ఉండొచ్చు అనేది లేటెస్ట్ టాక్. మరి ఎన్టీఆర్ జీవిత కథ హిట్ అయ్యి కలెక్షన్స్ పరంగా ప్లాప్ అయ్యింది. మరి అందుకే మహానాయకుడు మీద ఎవ్వరూ ఎటువంటి అంచనాలు పెట్టుకోవడం లేదు. ఇక షూటింగ్ పూర్తయ్యి... విడుదలకు రేడి అవుతున్న మహానాయకుడు మీద ప్రేక్షకులలో ఆసక్తి కలిగేలా క్రిష్ అండ్ బాలయ్యలు తొందరపడాల్సి ఉంది. అందుకే ప్రమోషన్స్ కూడా మొదలెట్టాల్సిన విషయం క్రిష్ పట్టించుకుంటే బావుంటుంది.