టాలీవుడ్ లో మోస్ట్ రోమాంటిక్ కపుల్ ఎవరు అంటే ఇప్పుడు నాగచైతన్య, సమంత అంటున్నారు కానీ.. ఒకప్పుడు నాగార్జున, అమలను మించిన రోమాంటిక్ కపుల్ ఎవరున్నారు చెప్పండి. శివ, నిర్ణయం సినిమాల టైమ్ లోనే ప్రేమించుకొని.. పెద్దలను ఒప్పించి పెళ్లాడిన ఈ జంట అప్పటి జనరేషన్ కు ఒక ఇన్స్పిరేషన్ గా నిలిస్తే.. ఇప్పటివారికి ఒక మంచి ఎగ్జాంపుల్ గా నిలిచారు. అయితే.. ఈమధ్యకాలంలో ఈ ఇద్దరూ కలిసి నటించలేదు. మనం సినిమాలోనూ ఏదో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండాలి కాబట్టి ఆమెను ఒక్క ఫ్రేమ్ లో అలా చూపించారు. అమల మాత్రం తమిళ, హిందీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూనే ఉంది.
అయితే.. నాగార్జున, అమలను ఒకసారి మళ్ళీ వెండితెరపై జంటగా చూపించాలన్న ఆలోచన వచ్చింది రాహుల్ రవీంద్రన్ కు. అందుకే నాగార్జున కథానాయకుడిగా తాను తెరకెక్కించనున్న మన్మధుడు 2 సినిమాలో ఒక ప్రధాన పాత్ర కోసం అమలను ఎంపిక చేసుకున్నాడు. కథ నాగార్జునతోపాటు అమలకు కూడా నచ్చడంతో మార్చి నుంచి మొదలవ్వనుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుట్ మరో కథానాయికగా కనిపించనుంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్ళీ వెండితెరపై జంటగా కనిపించనున్న నాగ్, అమల ఈసారి ఎలాంటి ఎగ్జాంపుల్ ను సెట్ చేస్తారో చూడాలి.