ప్రస్తుతం దక్షిణాది మొత్తం దేశం గర్వించదగ్గ దర్శకుడు బాలా దర్శకత్వంలో చియాన్ విక్రమ్ కుమారుడు ‘దృవ్’ని హీరోగా లాంచ్ చేస్తూ తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌గా రూపొందుతున్న ‘వర్మ’ పైనే చర్చ నడుస్తోంది. ఈ చిత్రం అవుట్‌పుట్ చూసిన హీరో విక్రమ్ తన తనయుడి లాంచింగ్ మూవీ బాగా లేదని భావించి, ఆ మొత్తాన్ని చెత్తగా వదిలేసి, మరలా మరో దర్శకుడితో ఈ చిత్రాన్ని తీయాలని నిర్ణయించాడు. అయితే అప్పటికే బిజినెస్ జరుపుకుంటున్న తరుణంలో ఇలా విక్రమ్ డేరింగ్ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్యర్యపరుస్తోంది.
ఎందుకంటే మరలా సినిమా మొత్తం రీషూట్ చేయడానికి అయ్యే బడ్జెట్ మొత్తాన్ని విక్రమ్ తానే స్వయంగా పెడతానని ముందుకు రావడం మరో విశేషం. దీనివల్ల ఇప్పటికే కాస్త ఫామ్‌ని కోల్పోయిన ఇది బాలకి పెద్ద షాకే. దీనిని ఆయనకు జరిగిన అవమానంగా కొందరు భావిస్తుంటే.. మరికొందరు మాత్రం ఇది తప్పని వాదిస్తున్నారు. కానీ ఇది ప్రైవేట్ వ్యవహారం కాబట్టి దీనిలో ఎలాంటి ఇబ్బంది లేదు.
ఇక ఈ చిత్రంపై హీరోయిన్ మేఘచౌదరి ఎన్నోఆశలు పెట్టుకుంది. తెలుగులో షాలినీ పాండేలాగా లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్స్‌లో నటించిన ఆమె ఈ చిత్రం విడుదలైతే తనకి మరిన్ని అవకాశాలు వస్తాయనే ఆశతో ఉంది. అయితే దర్శకుడు మారి మరలా మొత్తం రీషూట్ చేసే క్రమంలో మరలా ఆమెని హీరోయిన్‌గా తీసుకుంటారా? లేక వేరే వారికి అవకాశం ఇస్తారా? అనేది వేచిచూడాలి. ఇక దీనిపై కొందరు ఈ వ్యవహారాన్ని నాగార్జున, అఖిల్‌ల విషయంలో పోలుస్తున్నారు. అఖిల్ లాంచింగ్ మూవీ నితిన్ నిర్మాతగా, వినాయక్ దర్శకత్వంలో చేసిన ‘అఖిల్’. ఈ చిత్రం ఫస్ట్ కాపీ చూసి అది తన కుమారుడికి సరిపోయే సబ్జెక్ట్ కాదని ముందే ఊహించానని నాగ్ నాడు తెలిపాడు.
మరి నాడు నాగ్ కూడా విక్రమ్ లాగా డేర్‌గా ‘అఖిల్’ని ఆపేసి, తానే ఎందుకు మొత్తం సినిమాని రీమేక్ చేయడానికి పూనుకోలేదు? అనే లాజిక్ కొందరు బయటకు తీశారు. అయితే నాగార్జున ఏదైనా పక్కా బిజినెస్‌మెన్‌గా వ్యవహరిస్తాడు. అది తన చిత్రమైనా, లేక కుమారులదైనా సరే ఆయన ఆర్థిక వ్యవహారాలలో కఠినంగా ఉంటాడు కాబట్టే విక్రమ్‌లా డేరింగ్ డెసిషన్ తీసుకోలేకపోయాడని కొందరు అంటూ ఉండటం గమనార్హం.