Advertisementt

ఇర‌కాటంలో వెంకీ కుడుముల?

Sat 09th Feb 2019 01:34 PM
venki kudumula,nithin,bheeshma,sitara entertainments,suryadevara naga vamshi,rashmika mandanna,nithin bheeshma  ఇర‌కాటంలో వెంకీ కుడుముల?
venky kudumula career in trouble ఇర‌కాటంలో వెంకీ కుడుముల?
Advertisement
Ads by CJ

క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు కోపం..విడ‌వ‌మంటే పాముకు కోపం అన్న‌ట్టు త‌యారైంది యువ ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల ప‌రిస్థితి. నాగ‌శౌర్య‌తో తొలి ప్ర‌య‌త్నంగా రూపొందించిన `ఛ‌లో` అత‌నితో పాటు వెంకీ కుడుముల‌కు మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఆ హిట్‌ని క్యాష్ చేసుకోవాల‌ని తొంద‌ర‌ప‌డిన నాగ‌శౌర్య `@న‌ర్త‌న‌శాల‌`తో దెబ్బైపోతే ద‌ర్శ‌కుడిగా ఓ మెట్టెక్కాల‌ని నితిన్‌ని న‌మ్ముకున్న వెంకీ కుడుముల ప‌రిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. నితిన్ హీరోగా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంకీ కుడుముల ఓ సినిమా ప్లాన్ చేసుకున్న విష‌యం తెలిసిందే. 

`భీష్మ‌` అనే టైటిల్‌ని కూడా సెట్ చేసుకున్నఅత‌నికి హీరో నితిన్ రూపంలోనే స్పీడు బ్రేక‌ర్ ఎదుర‌వుతోంది. ఎప్పుడో సెట్స్‌పైకి రావాల్సిన ఈ సినిమా నితిన్‌కు చేయి ఫ్రాక్చ‌ర్ అయిన‌ కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. అయితే పైకి అస‌లు విష‌యం అది అని చెబుతున్నా నితిన్‌ పారితోషికం లెక్క తేల‌లేద‌ని, ఆ కార‌ణంగానే సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ని వాయిదా వేస్తున్నాడ‌ని తెలిసింది. వ‌రుస ఫ్లాపులు రావ‌డంతో నితిన్ పారితోషికాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ వారు త‌గ్గించార‌ట‌. అదెలా కుదురుతుంది. లై, ఛ‌ల్ మోహ‌న‌రంగ‌, శ్రీ‌నివాస‌క‌ల్యాణం చిత్రాల‌కు ముందే సితార‌లో అనుకున్న ప్రాజెక్ట్ కాబ‌ట్టి ఆ సినిమాల‌కు అందిన పారితోషికం ఇవ్వాల్సిందే అన్న‌ది నితిన్ వాద‌న‌. 

పారితోషికం విష‌యంలో అటు సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవ‌ర నాగ‌వంశీ, ఇటు హీరో నితిన్ త‌గ్గ‌క‌పోవ‌డంతో సినిమా ప‌ట్టాలెక్క‌డం ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది. ఇది ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌కు సంక‌టంగా మారింది. ఈ సినిమా త‌రువాత వెంట‌నే మ‌రో సినిమా చేయాల‌ని ఇప్ప‌టికే ఫిక్స్ అయి అక్క‌డ అడ్వాన్స్ కూడా తీసుకున్న వెంకీ కి నితిన్‌తో సినిమా సంక‌టంగా మారింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. నితిన్‌, సితార బెట్టు వీడేది ఎప్పుడు త‌న సినిమా మొద‌ల‌య్యేది ఎప్పుడ‌ని వెంకీ త‌ల‌ప‌ట్టుకుంటున్నాడ‌ట‌.

venky kudumula career in trouble:

venky kudumula bheeshma in trouble

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ