Advertisementt

డైరెక్ట‌ర్..ప్రొడ్యూస‌ర్ బూతు పురాణం!

Fri 08th Feb 2019 12:24 PM
baoyapati,boyapati srinu,d.v.v.danayya,ram charan,vinaya vidheya rama,dil raju  డైరెక్ట‌ర్..ప్రొడ్యూస‌ర్ బూతు పురాణం!
boyapati and danayya abusing each other డైరెక్ట‌ర్..ప్రొడ్యూస‌ర్ బూతు పురాణం!
Advertisement
Ads by CJ

ఓ స్టార్ డైరెక్ట‌ర్ (త‌ను అనుకుంటాడులే), ఈ మ‌ధ్య భారీ సినిమాలు నిర్మిస్తున్న ఓ బిగ్ ప్రొడ్యూస‌ర్ ఇద్ద‌రూ బూతు పురాణం మొద‌లుపెట్టారు. ఒక‌రిపై ఒక‌రు తిట్ల దండ‌కం అందుకున్నారట‌. రీసెంట్‌గా ఓ స్టార్ హీరోతో ఆ హీరో స్కూల్‌కు భిన్నంగా ఊర‌మాస్ సినిమా చేశారు. ఈ సినిమాకు హీరోకు భారీగానే ముట్టింది. ద‌ర్శ‌కుడి అంత కాదు లెండి. ఇక ద‌ర్శ‌కుడు స‌ద‌రు ఊర‌మాస్ సినిమా ద్వారా 15 కోట్లు పారితోషికం కింద దండుకున్నాడు. భారీ అంచ‌నాలు వుండ‌టంతో సినిమాని ఏకంగా దాదాపు 80 నుంచి 90 కోట్ల‌కు బిజినెస్ చేసుకున్నారు. 

తీరా విడుద‌లైన సినిమా ప్రేక్ష‌కుల పాలిట విధ్వంస‌క‌ర చిత్రంగా మారింది. దారుణ‌మైన ప‌రాజ‌యాన్ని సొంతం చేసుకుంది. హీరో, ద‌ర్శ‌కుడు, నిర్మాత బాగానే వున్నారు. సినిమా కొన్న బ‌య్య‌ర్లు, థియేట‌ర్‌కు వ‌చ్చి సినిమా చూసిన ప్రేక్ష‌కులు భారీగా న‌ష్ట‌పోయారు. ప్రేక్ష‌కుడు ఎవ‌రిని త‌న డ‌బ్బు తిరిగి ఇమ్మ‌ని అడ‌గ‌లేడు కాబ‌ట్టి బ‌య్య‌ర్లు మాత్రం కొంచెం గ‌ట్టిగానే హీరో , నిర్మాత‌ను నిల‌దీస్తున్నారు. హీరో త‌న పారితోషికంలో స‌గం ఇవ్వ‌డానికి ముందుకొచ్చాడు. నిర్మాత ఎంతో కొంత తిరిగిచ్చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు ఇక్క‌డే పెద్ద ట్విస్ట్ వ‌చ్చిప‌డింది. మీరిస్తే నేనెందుకు ఇవ్వాలి. కోటి వ‌ర‌కైతే ఓకే అన్నాడు స‌ద‌రు ద‌ర్శ‌కుడు. 

నిర్మాత‌కు చిర్రెత్తుకొచ్చింది. 15 కోట్లు తీసుకుని ఫ్లాప్‌ సినిమా తీసి కోటి తిరిగిచ్చేస్తానంటావా అంటూ బూతు పురాణం అందుకున్నాడ‌ట‌. నేనేమైనా త‌క్కువ తిన్నానా అనుకున్నాడు ద‌ర్శ‌కుడు. క‌థ చెప్పే స‌మ‌యంలోనే బూతులు లేకుండా చెప్ప‌ని స‌ద‌రు ద‌ర్శ‌కుడు కూడా బూతు పురాణం అందుకున్నాడ‌ట‌. మ‌ధ్య వ‌ర్తిగా వ‌చ్చిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించిన నిర్మాత త‌ల‌ప‌ట్టుకోవాల్సి వ‌చ్చింద‌ట‌. ఒక‌రిపై ఒక‌రు బూతు పురాణం విప్పుకుంది ఏ సినిమా గురించో ఇప్ప‌టికే అర్థ‌మైవుంటుంది. య‌స్ `విన‌య విధేయ రామ‌` గురించే. 

boyapati and danayya abusing each other :

boyapati and danayya fighting each other

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ