టాలీవుడ్‌లో అల్లుఅరవింద్ ‘గీతాఆర్ట్స్’, దిల్‌రాజు ‘శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్’ తర్వాత దూకుడుగా దూసుకుపోతోన్న సంస్థలుగా యువి క్రియేషన్స్, మైత్రి మూవీమేకర్స్‌ని చెప్పుకోవాలి. ఇక సురేష్‌బాబు, గీతాఆర్ట్స్2 వంటివి కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఇక విషయానికి వస్తే కథ డిమాండ్‌ని బట్టి బడ్జెట్‌ని కేటాయించడంలో తప్పు లేదు. కానీ ఫలానా హీరో ముందు చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ ఇంత జరిగింది కాబట్టి.. అంతకంటే ఎక్కువ బడ్జెట్‌ని ఆయా హీరోలకు కేటాయించడం తప్పు అనే చెప్పాలి. గతంలో రవితేజ, రామ్, నితిన్, నాగచైతన్య వంటి పలువురు మినిమం గ్యారంటీ హీరోలుగా ఎదిగిన తర్వాత తమ రెమ్యూనరేషన్‌తో పాటు, బడ్జెట్‌ను కూడా భారీగా పెంచి ఇదే తప్పు చేశారు.
ఇప్పటికే ‘సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రాల ద్వారా ఈ విషయం మైత్రి మూవీమేకర్స్‌కి అర్ధమై ఉండాలి. కానీ వారు అదే తప్పును మరోసారి చేస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. మైత్రి బేనర్ త్వరలో నేచురల్ స్టార్ నాని హీరోగా, ఇంటెలిజెంట్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించనుంది. నాని స్టార్‌గా ఎదగడంలోనూ, మినిమం గ్యారంటీ స్టార్‌గా పేరు తెచ్చుకోవడంలోనూ ఆయన వరుస హిట్స్ తర్వాత కూడా పెద్దగా రెమ్యూనరేషన్ పెంచకపోవడం, మినిమం బడ్జెట్ ఉండేలా చూసుకోవడం సహాయపడ్డాయి. లిమిటెడ్ బడ్జెట్ వల్లనే ఆయన వరుసగా ఎవ్వరూ ఊహించని విజయాలు, నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టాడు.
కానీ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో చేయబోయే మైత్రి మూవీమేకర్స్ చిత్రం కోసం ఏకంగా ఇప్పుడు 50కోట్ల బడ్జెట్ కేటాయించడం సంచలనం సృష్టిస్తోంది. నాని ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరు దర్శకత్వంలో నటిస్తున్న ‘జెర్సీ’ చిత్రం విడుదలకు ముందే 50కోట్ల పెట్టుబడిని రాబట్టుకోవడంతో మైత్రి వారు కూడా దీనికి అంగీకారం తెలిపారు. దర్శకునిగా విక్రమ్ కె.కుమార్‌కి వంకపెట్టలేం గానీ ఆయన ‘మనం’ తర్వాత చేసిన సూర్య ‘24’, అఖిల్ ‘హలో’ చిత్రాలకు బాగా ఉన్నాయనే టాక్ వచ్చిన ఓవర్ బడ్జెట్ వల్ల ఇవి కాస్ట్ ఫెయల్యూర్స్‌గా నిలిచాయి.
ఈ మధ్యకాలంలో ఎన్నో చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చినా ఫ్లాప్ ముద్ర పడటానికి కాస్ట్ ఫెయిల్యూర్సే కారణమని నిరూపితం అయింది. మరి నాని-విక్రమ్-మైత్రి కాంబినేషన్ 50కోట్ల బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మిస్తే అది తప్పకుండా బ్లాక్‌బస్టర్ అయితేనే సేఫ్టీ ప్రాజెక్ట్ అవుతుంది. అంటే నానికి ‘భలే భలే మగాడివోయ్’తో సరిసమానమైన, లేదా అంతకు మించిన పెద్ద హిట్ రాకపోతే వర్కౌట్ కావడం కష్టమేనని చెప్పాలి.