Advertisementt

‘ప్రేమ ప‌రిచ‌యం’ మొదలైంది

Fri 08th Feb 2019 12:04 AM
prema paricheyam,movie,opening,details  ‘ప్రేమ ప‌రిచ‌యం’ మొదలైంది
Prema Paricheyam Movie Opening Details ‘ప్రేమ ప‌రిచ‌యం’ మొదలైంది
Advertisement
Ads by CJ

ప్రేమ్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తున్న ‘ప్రేమ ప‌రిచ‌యం’ గురువారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా మొద‌లైంది. ర‌జ‌త్ రాఘ‌వ్ హీరోగా న‌టిస్తున్నారు. సిద్ధికా శ‌ర్మ‌, క‌రీష్మా కౌల్ నాయిక‌లు. శివ‌.ఐ ద‌ర్శ‌కుడు. ఎం. పెరుమాండ్లు నిర్మాత‌. ముహూర్త‌పు స‌న్నివేశానికి చిత్ర నిర్మాత పెరుమాండ్లు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. పారిశ్రామిక‌వేత్త సుభాష్ రెడ్డి క్లాప్‌నిచ్చారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ డైర‌క్ట‌ర్‌ మామిడి హ‌రికృష్ణ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 

చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘‘యువ‌తీ యువ‌కులు తెలిసీ తెలియ‌క ఎన్నో పొర‌పాట్లు చేస్తుంటారు. అయితే వాటి ప్ర‌భావం భ‌విష్య‌త్తుపై ఉంటుందని చెప్పే చిత్ర‌మిది. రొమాన్స్ తో పాటు అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి. యువ‌త‌కు చ‌క్క‌టి సందేశాన్నిచ్చే సినిమా అవుతుంది. ఈ నెల 11 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెడ‌తాం’’ అని అన్నారు. 

ద‌ర్శ‌కుడు శివ మాట్లాడుతూ ‘‘ప్రేమ గురించి ఎన్నోచిత్రాలు వ‌చ్చాయి. అయితే అస‌లు ప్రేమ ఎలా స్టార్ట్ అవుతుంది? అనే విష‌యాన్ని లోతుగా ఈ సినిమాలో  చూపిస్తున్నాం. ఈ సినిమా ద్వారా కొత్త టెక్నాల‌జీని ఉప‌యోగిస్తున్నాం. బ్యాక్ గ్రౌండ్‌లో వ‌చ్చే నేచ‌ర్‌ని కూడా విజువ‌ల్ ఎఫెక్ట్స్ ద్వారా చూపిస్తున్నాం. దీన్ని కొత్త టెక్నాల‌జీతో చేస్తున్నాం. ద‌ర్శ‌కుడిగా ఇది నా తొలి సినిమా. నిర్మాత మా ఫ్రెండ్‌. ఆయ‌న ప‌రిచ‌య‌మ‌వుతూ నన్ను డైర‌క్ట‌ర్‌గా ప‌రిచ‌యం చేస్తున్నారు’’ అని అన్నారు.

కరిష్మా కౌర్ మాట్లాడుతూ ‘‘స‌బ్జెక్ట్ బావుంది. రెండు ఫేస్‌లున్న క్యార‌క్ట‌ర్‌లో న‌టిస్తున్నా’’ అని అన్నారు. 

కృతిక శ‌ర్మ మాట్లాడుతూ ‘‘తెలుగులో ఇది నా మూడో సినిమా . ఇందులో మంచి మోడ్ర‌న్ అమ్మాయిగా న‌టిస్తున్నా’’ అని చెప్పారు.

మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ‘‘ద‌ర్శ‌కుడు శివ నాకు చాలా కాలంగా తెలుసు. ప్రేమ గురించి ఇప్ప‌టిదాకా ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. అయితే వాట‌న్నిటిలోకీ ఇది భిన్నంగా ఉంటుంద‌ని ఆశిస్తున్నాను’’ అని అన్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: అగ‌స్త్య‌, కెమెరా: మాదేశ్‌, ఎడిట‌ర్‌: నంద‌మూరి హ‌రి, ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌:  ఎస్‌.అశోక్ గౌడ్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  ర‌వీంద‌ర్ బెక్కం, త్రీడీ, వీఎఫ్ ఎక్స్:  శివ త్రీడీ స్టూడియోస్‌, త్రీడీ క్రియేటివ్ హెడ్‌:  శ్రీకాంత్‌.ఐ.

Prema Paricheyam Movie Opening Details:

Prema Paricheyam Movie Starts

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ