Advertisementt

అనిల్ రావిపూడి, మహేష్.. కథేంటో?

Thu 07th Feb 2019 10:11 PM
mahesh babu,anil ravipudi,f2 movie,super star,comedy director  అనిల్ రావిపూడి, మహేష్.. కథేంటో?
Mahesh Babu and Anil Ravipudi combo soon అనిల్ రావిపూడి, మహేష్.. కథేంటో?
Advertisement
Ads by CJ

వరసగా నాలుగు సినిమాలు హిట్ అవ్వడంతో డైరెక్టర్ అనిల్ రావిపూడికి పెద్దపెద్ద ఆఫర్స్ వస్తున్నాయి. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో నుండి కూడా అనిల్ కు ఆఫర్ వచ్చింది. మహేష్ నటించిన ‘దూకుడు, ఆగడు’ సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన అనిల్‌తో మహేష్ సినిమా చేద్దాం కథ రెడీ చేయి అని చెప్పాడట.

అయితే ఇక్కడ విషయం ఏంటంటే అనిల్.. మహేష్‌తో ఎటువంటి సినిమా తీస్తాడనేదే అందరూ ఆసక్తిగా చూస్తున్న అంశం. అనిల్‌కు మంచు కామెడీ టైమింగ్ ఉంది కాబట్టి మహేష్‌తో కూడా కామెడీ నేపథ్యంలో సాగే సినిమా తీస్తాడా? లేదా ‘ఆగడు’లా పోలీస్ యాక్షన్ సినిమా తీస్తాడా? అనేది చూడాల్సిన విషయం. 

అనిల్ దగ్గర మాఫియా అండ్ పోలీస్ నేపథ్యంలో సాగే చాలా కథలు ఉన్నాయంట. వాటిలో ఒకటి మహేష్‌ కోసం దించుతాడని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అయితే మహేష్ మాత్రం ఆగడు తరువాత నుండి పోలీస్ పాత్రలంటే పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. చూద్దాం మరి వీరి నుంచి ఎటువంటి సినిమా వస్తుందో...

Mahesh Babu and Anil Ravipudi combo soon:

Superb Offer to Anil Ravipudu from Super Star

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ