Advertisementt

చైతూనా.. సమంతానా.. ఎవరివల్ల ఈ క్రేజ్?

Thu 07th Feb 2019 06:44 PM
naga chaitanya,samantha,craze,majili,satellite rights,shiva,chaitu  చైతూనా.. సమంతానా.. ఎవరివల్ల ఈ క్రేజ్?
Superb Craze to Majili Satellite Rights చైతూనా.. సమంతానా.. ఎవరివల్ల ఈ క్రేజ్?
Advertisement

భార్యాభర్తలైన నాగ చైతన్య - సమంత‌లలో ఎక్కువ క్రేజ్ సమంతకే వుంది. పెళ్లి తర్వాత కూడా సమంత వరస హిట్స్ తో కెరీర్ లో దూసుకుపోతుంది. కానీ చైతు పెళ్ళికి ముందు.. పెళ్లి తర్వాత కూడా హిట్ కొట్టలేక అది ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాడు. అయితే పెళ్ళికి ముందు రెండు మూడు సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట పెళ్లి తర్వాత చాలా రోజులకు శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ సినిమాలో నటిస్తున్నారు. ఇక చైతు మార్కెట్ పడిపోయినా.. సమంతకున్న క్రేజ్ అలాగే... భర్తలిద్దరూ కలిసి పెళ్లి తర్వాత కలిసి నటించడం, అంతేకాకుండా ‘నిన్ను కోరి’ హిట్‌తో ఉన్న దర్శకుడు శివ నిర్వాణ వలన మజిలీ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి

తాజాగా మజిలీ సినిమా శాటిలైట్ హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయని.. చైతూ సినిమాల బిజినెస్ విషయంలో శాటిలైట్ హక్కులకు భారీ క్రేజ్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. యుద్ధం శరణం పోయినా... శాటిలైట్ హక్కులు ఆరు కోట్లకి అమ్ముడుపోగా.. యావరేజ్ అనుకున్న శైలజా రెడ్డి కూడా ఆరున్నర కోట్లకి అమ్ముడు పోయిందని.. అలాగే చైతూ కెరీర్ లో భారీ డిజాస్టర్ గా నిలిచిన సవ్యసాచి కూడా 6 కోట్లకి అమ్ముడు పోయిందని.. చైతూకి శాటిలైట్ మార్కెట్ బాగుంటుందని.. అందుకే ఈ మజిలీ సినిమా శాటిలైట్ హక్కులను జీ తెలుగు వారు ఆరు కోట్లకు కొనేశారంటున్నారు.

మరి ఇక్కడ చైతూ శాటిలైట్ క్రేజ్ కన్నా ఎక్కువగా... సమంత క్రేజ్ ఎక్కువ కనబడుతుంది. గత ఏడాది సమంత నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్. ‘రంగస్థలం, మహానటి, అభిమన్యుడు, యు టర్న్’ అన్ని సినిమాలు హిట్ కావడం, హాట్ హీరోయిన్ అయిన సమంతకున్న క్రేజ్ కారణంగానే మజిలీ శాటిలైట్ బిజినెస్ ఈ రేంజ్ లో జరిగింది కానీ.. నాగ చైతన్యని చూసి కాదంటున్నారు కొందరు. మరి వరస వైఫల్యాలతో బాధపడుతున్న చైతూ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. వరస సినిమాల్తో ఫుల్ బిజీగా వున్నాడు. ఈ ఏడాది మజిలీ, వెంకీ మామ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చి... వచ్చే ఏడాది మరో రెండు మూడు సినిమాల్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్లాన్ చేస్తున్నాడు.

Superb Craze to Majili Satellite Rights:

Full Demand to Chaitu and Samantha Film Majili Satellite Rights

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement